E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదం… ఇంతకీ మురుగన్ పుట్టింది ఎక్కడ ?

ఎన్టీఆర్ కొత్త సినిమా పోస్టర్‌పై చెలరేగుతున్న వివాదం… ఇంతకీ మురుగన్ పుట్టింది ఎక్కడ ?
  • తారక్-త్రివిక్రమ్ మూవీపై మురుగన్ వివాదం!

  • పోస్టర్‌తోనే కాంట్రవర్సీ.. చిక్కుల్లో నాగవంశీ?

  • ‘తమిళ్ కడవుల్’ వ్యాఖ్యలపై కోలీవుడ్ ఫైర్!

  • మురుగన్ ఎవరిది? సోషల్ మీడియాలో వార్ స్టార్ట్!

Advertisement

Murugan Controversy: సినీ ఇండస్ట్రీలో వినోదం, వివాదం కలిసి సావాసం చేస్తాయన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఏదైనా సెన్సేషన్ అప్ డేట్ వస్తే చాలు దానితో పాటు కూడా అంటూ కాంట్రవర్సీ రావడం ఇక్కడ కొత్తేమీ కాదు. ఇదిగో అలాంటి ఓ సరికొత్త కాంట్రవర్సీని తీసుకొచ్చింది లేటెస్ట్ గా వచ్చిన తారక్ త్రివిక్రమ్ పోస్టర్.

 కాంట్రవర్సీకి దారి తీసిన నాగ వంశీ పోస్ట్ 

విషయంలోకి వెళ్తే… నిన్న వదిలిన పోస్టర్ ని చూస్తె తెలిసిపోతుంది ఇది సుబ్రహ్మణ్య స్వామి (లార్డ్ మురుగన్) గురించిన కథ అని , ఆయన తత్త్వం గురించి ఇందులో చూపించబోతున్నారని. అయితే తాజాగా ఈ సినిమాని నిర్మిస్తున్న నాగ వంశీ ఉత్తరాదిన జన్మించి, హృదయభూమిలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు” అనే క్యాప్షన్ తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేయడం ఇపుడు వివాదానికి కారణం అయింది.

Advertisement

అసలే సుబ్రహ్మణ్య స్వామిని తమిళులు మురుగన్ గా ఎన్నో ఏళ్లనుండి కొలుస్తున్నారు.పైగా మురుగన్‌ను తమ ‘తమిళ్ కడవుల్’ (తమిళ దేవుడు)గా, తమ అస్తిత్వానికి ఒక గుర్తుగా భావిస్తారు.పైగా తమిళంలో కొన్నివేల సంవత్సరాల కిందటే ప్రాచీన గ్రంధాలలో, సాహిత్యాలలో మురుగన్ గురించి రాసి ఉందని , అలాంటప్పుడు మా దేవుడిని అలా ఎలా ఉత్తరాది దేవుడిగా చిత్రీకరిస్తారు అంటూ మండిపడుతున్నారు తమిళ తంబీలు.ఇది ఒకరకంగా తమ సంస్కృతిని, చరిత్రను వక్రీకరించడమే అంటూ నాగ వంశీ పై ఫైర్ అవుతున్నారు.

తారక్ మూవీకి బాయ్‌కాట్ హెచ్చరికలు..!

Advertisement

ఇక దీనితో పాటే రాజుకున్న మరో వివాదం పోస్టర్ పై సంసృతపదాలని వాడటం.పోస్టర్‌లో డిజైన్ చేసిన త్రిశూలం డీఎన్ఏ ఆకారం ఒకవైపు సైన్స్ అండ్ మైథాలజీని మిక్స్ చేసినట్టుగా చూపడం బాగానే ఉంది,కాని మురుగన్ సినిమా తీస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత శ్లోకం ‘సుబ్రహ్మణ్య భుజంగం’ను ఎలా వాడతారని, తమిళ భాషకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంటే అది తమిళ ప్రజలని కించపరచడమే అంటూ వాపోతున్నారు.ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాని అవసరమైతే బాయ్ కాట్ చేయడానికి కూడా వెనుకాడమంటూ హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తున్నారు కోలీవుడ్ జనాలు.

తమిళ తంబీలని త్రివిక్రమ్ ఎలా కూల్ చేస్తాడో !

అయితే ఇదే విషయమై మరికొంతమంది నాగావంశికి మద్దతుగా నిలవడం విశేషం.పార్వతీ పరమేశ్వరుల రెండో కొడుకైన కార్తికేయుడు హిమాలయాల్లోని శరవణ భవ అనే ప్రాంతంలో పుట్టాడని, తారకాసుర వధ కోసం మరియు ధర్మసంస్థాపన కోసం దక్షిణాదికి వచ్చాడని శివపురాణం మరియు స్కాందపురాణంలలో అదే ఉందంటూ వాదిస్తున్నారు.ఏది ఏమైనా ఎప్పటిగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ ఇప్పటికైనా వచ్చిందని సంతోష పడాలా లేక వచ్చీ రాగానే ఇలా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిందని బాధ పడాలా అంటూ జుట్టు పీకేసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్.చూడాలి మరి మా మనో భావాలు దెబ్బ తిన్నాయని తెగ ఫీల్ అవుతున్న తమిళ తంబీలని త్రివిక్రమ్ ఎలా కూల్ చేస్తాడో !

also read:రాజమౌళి, సుకుమార్ రూట్లోనే ‘గురూజీ’…గాడ్ ఆఫ్ వార్ తో పాన్ ఇండియా స్కెచ్!

Related News

రంభ ఊర్వశి మేనక అంటున్న అల్లరోడు… ఈసారైనా అలరిస్తాడా ?

వంద కోట్లొచ్చాయని డబ్బా కొట్టుకున్నారు.. కానీ డైరెక్టర్‌కు’ పెద్ద నామం పెట్టారు!

వివాదాల్లో ఇరుక్కొని ఈ యంగ్ హీరోలు కెరియర్ పాడు చేసుకుంటున్నారా?

హీరో మహేష్ బాబుకి భారీ షాక్..AMB తోపాటు మరో 5 థియేటర్ల పై భారీ వేటు!

రామాయణ ట్రైలర్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్..ఇండియాలో మాత్రం కాదండోయ్!

రాజమౌళి, సుకుమార్ రూట్లోనే ‘గురూజీ’…గాడ్ ఆఫ్ వార్ తో పాన్ ఇండియా స్కెచ్!

టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ‘ఇళ్ల స్థలాల’ దందా.. నాకు సంబంధం లేదన్న టాలీవుడ్ డైరెక్టర్

Big Stories

×