E-Paper
Advertisement

Rajinikanth: సూపర్ స్టార్ ను లైన్ లో పెట్టిన లేడీ డైరెక్టర్..

Rajinikanth: సూపర్ స్టార్ ను లైన్ లో పెట్టిన లేడీ డైరెక్టర్..
Advertisement

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సీక్వెల్ సినిమా జైలర్ 2 పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం రజనీకాంత్ కమల్ హాసన్ నిర్మాణంలో మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

సుధా కొంగర డైరెక్షన్లో రజనీకాంత్..

ఈ సినిమాకు సుందర్ సీ దర్శకత్వం వహించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు కానీ కొన్ని కారణాల వల్ల సుందర్ తప్పుకోవడంతో కొత్త దర్శకుడు వేటలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ తో సినిమా గురించి ప్రముఖ లేడీస్ దర్శకురాలు సుధా కొంగర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె  రజినీకాంత్ తో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై సుధా స్పందించారు.

పరాశక్తి ప్రమోషన్స్..

Advertisement

సుధా కొంగర ప్రస్తుతం శివ కార్తికేయన్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా తిరిగిన పరాశక్తి సినిమా పనులలో బిజీగా ఉన్నారు పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2026 జనవరి 10వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా రజిని గారితో సినిమా ఎప్పుడు అనే ప్రస్తావన రావడంతో ఈమె అసలు విషయాన్ని బయటపట్టారు.

రజనీకాంత్ తో ప్రేమ కథ సినిమా..

Advertisement

సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని చేయటమే తన జీవిత లక్ష్యం అని తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ కూడా సిద్ధంగా ఉందని త్వరలోనే ఈ సినిమా పూర్తి కథను సిద్ధం చేసి రజిని గారు ఒప్పుకుంటే ఈ సినిమా చేస్తానని సుధా కొంగర వెల్లడించారు. మరి ఈ టాలెంటెడ్ దర్శకురాలి కోరికను తలైవా తీరుస్తారా? ఆమెకు సినిమా చేసే అవకాశాన్ని ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇలా రజనీకాంత్ గారితో ప్రేమ కథ సినిమా అని చెప్పడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా ఆఖరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.

Also Read: Big tv kissik Talks: శివాజీ మాటల్లో తప్పేముంది.. ఆయన ఉద్దేశం కరెక్టే: అరియాన

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×