E-Paper
Advertisement

అయ్యప్ప పాటలో రవితేజ మాస్ స్టెప్పులు.. ‘మల్లెపూల పల్లకి’ అదిరిపోయిందిగా!

అయ్యప్ప పాటలో రవితేజ మాస్ స్టెప్పులు.. ‘మల్లెపూల పల్లకి’ అదిరిపోయిందిగా!
Advertisement

Mallepoola Pallaki:వరుస ప్లాపులతో సతమతమైపోతున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఇరుముడి అంటూ మరో సినిమాతో ఆడియన్స్ నిఅలరించడానికి  రెడీ అయిపోయాడు.ఈ సినిమాకి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నాడు .

గతంలో నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి సెన్సిబుల్ సినిమాలని అందించిన శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇక ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామిగా కనిపించనున్నాడని మూవీ టీమ్ వదిలిన అప్డేట్స్ చూస్తేనే అర్థమయిపోతుంది .

 ఘనంగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్

Advertisement

ఇప్పటికే టీజర్ రాగా తాజాగా ఈరోజు అంటే ఆగస్టు 16న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం .ఈ ఈవెంట్ లోనే ఎంతోమంది ఎదురుచూస్తున్న మల్లెపూల పల్లకి అనే పాటను ఘనంగా లాంచ్ చేశారు కూడా.

ఇక  అయ్యప్ప స్వామి భక్తి పాటగా రూపొందిన ఈ పాటలో జానపద పదాలని కూడా మిళితం చేయడం విశేషం.ఇక వరుస సినిమాలతో సత్తా చాటుతున్న జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడంతో సినిమా క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

కొరియోగ్రఫీ పాటకు మరో హైలెట్

Advertisement

చౌడం శ్రీనివాసరావు రాసిన ఈ పాట ఒక మామూలు భక్తి పాటలా కాకుండా పల్లెటూరి వాతావరణన్ని గుర్తుచేసే పాదాలతో పాటని రాయడం విశేషం .ఇక ఈ పాటకి శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ పాటకు మరో హైలెట్ అనే చెప్పాలి.

ఈ పాటకు రవితేజ మాస్ స్టెప్పులని యాడ్ చేయడంతో పాటలో మరింత ఎనర్జీ కనిపించింది.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని ,వై రవి శంకర్ కలిసి నిర్మిస్తున్నసంగతి తెలిసిందే.

రవితేజ కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటిస్తుండగా , వితేజ కూతురి పాత్రలో నక్షత్ర అనే అమ్మాయి నటిస్తుంది.ఇక అజయ్ ఘోష్, సాయికుమార్ ,స్వాసిక రమేష్ ఇందిరా వంటి నటీనటులు ఇందులో ప్రముఖ పాత్రలలో కనిపించనున్నారు.

also read :బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

ఆగస్టు 21న థియేటర్లలో

ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ,భక్తి ఎంత ఉందో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో ఉండనున్నాయని  అర్థమవుతుంది.చూడాలి మరి గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రవి తేజకి ఇరుముడి సినిమా ఎలాంటి ఫలితాన్ని తీసుకువస్తుందో ఆగస్టు 21న థియేటర్లలో తేలిపోనుంది!

Tags

Related News

56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ

సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

అడివి శేష్ రిలీజ్ చేసిన ‘అ’.. రాహుల్ విజయ్ లుక్ చూస్తే మామూలుగా లేదు!

త్రిష ఆస్తుల లెక్క చూస్తే మైండ్ బ్లాక్.. ఇల్లు, కార్లు అన్నీ కోట్లలోనే!

విశ్వనాథ్ అండ్ సన్స్‌…అచ్చం అలాగే ఉందే!

Big Stories

Advertisement
×