E-Paper
Advertisement

సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!
Advertisement

Viswanath & Sons:వచ్చేశాడు సూర్య హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు..‘ ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’,కంగువా, రెట్రో, కరుప్పు అంటూ ఏవో సినిమాలు చేశామంటే చేశాము అన్నట్టె కాని ఇది నా సాలిడ్ హిట్ అని చెప్పుకోలేకపోయిన సూర్య ఎట్టకేలకి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ఎట్టకేలకి సక్సెస్ బాట పట్టేశాడు.

 మొదటి రోజే రూ34 కోట్లకు పైగా

డు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  మొదటి రోజే రూ34 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టగా ,ఏకంగా రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం.ఇక సూర్య సెంచరీ కొట్టేశాడు అంటూ  మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ అనౌన్స్ మెంట్ వదలడంతో మురిసిపోతున్నారు సూర్య ఫ్యాన్స్.ఇక ఈ సినిమా తమిళ నాటనే కాకుండా తెలుగులోనూ పాజిటివ్ టాక్ తో సాలిడ్ వసూల్లని దక్కించుకోవడం విశేషం.

Advertisement

ఈ సినిమా పై మొదటి నుండి కాన్ఫిడెంట్ గానే కన్పించింది మూవీ టీమ్, పైగా సార్, లక్కీ భాస్కర్ వంటి క్రేజీ హిట్స్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం,పైగా ఇందులో మమితా బైజు,రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ వంటి టాప్ స్టార్స్ నటించడంతో మూవీ పై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి.

సినిమాకి క్యూ కట్టేస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్

ఇక ఈ సినిమాకి మరో ఎస్సెట్ మ్యూజిక్ అని చెప్పాలి.సౌత్ ఇండస్ట్రీలో తనవైన సినిమాలతో దూసుకుపోతున్న జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో లెవెల్ కి తీసికెళ్ళింది.ఇక సినిమా ముఖ్యంగా కుటుంబ బంధాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కట్టేస్తున్నారు.

Advertisement

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసిన నాగ వంశీ మొత్తానికి ట్రోలర్స్ కి చిక్కకుండా తప్పించుకున్నాడు.లేకపోయుంటే మీమ్ పేజీల్లో ఎక్కడ చూసినా నాగ వంశీయే దర్శనమిచ్చేవాడు.మొత్తానికి ఎన్నాళ్ళగానో ఎదురు చూసిన సాలిడ్ హిట్ ని విశ్వనాథ్ అండ్ సన్స్ అందించింది. ఇక ప్రస్తుతం జోరు మీదున్న ఈ కలెక్షన్స్ కి వీకెండ్ కూడా కలిసొస్తే సినిమా ఈజీగా మరో యాబయ్ కోట్లని వెనకేసినా ఆశ్చర్యం లేదు.

also read :అడివి శేష్ రిలీజ్ చేసిన ‘అ’.. రాహుల్ విజయ్ లుక్ చూస్తే మామూలుగా లేదు!

ఏది ఏమైనా ఒకప్పుడు గజినీ ,సింగం, 24 వంటి సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన సూర్య తిరిగి హిట్ సినిమా ని ఖాతాలో వేసుకోవడంతో మురిసిపోతున్నారు సూర్య ఫాన్స్.

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×