E-Paper
Advertisement

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?

ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?
Advertisement

NTR:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న ఎన్టీఆర్ .. ఆ తర్వాత కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక హిందీలో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీళ్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

కిమ్స్ హాస్పిటల్ నుండి హెల్త్ అప్డేట్..

అయితే ఎన్టీఆర్ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడుతూ ఎన్టీఆర్ భుజానికి గాయమైందని, శస్త్ర చికిత్స జరగాలని, 6 వారాలపాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారు అంటూ ఒక ప్రకటన విడుదలయింది. ఇక ఆ ప్రకటన విడుదలైన కొన్ని రోజులకు సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం నుండి మరో ప్రకటన వెలువడింది. ఇక వైద్య బృందం సమక్షంలో ఎట్టకేలకు ఎన్టీఆర్ కి సర్జరీ విజయంగా పూర్తయింది. సర్జరీ తర్వాత ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ డిశ్చార్జ్ అవ్వడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి తాజాగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయన ఎన్టీఆర్ ఆరోగ్యం పై , ప్రస్తుత పరిస్థితిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి తొలి అడుగు.. 36ఏళ్ల వయసులోనే ప్రముఖ నటి మృతి!

డాక్టర్ ఏమన్నారంటే?

కిమ్స్ డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ..ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చాలామంది నుంచి మాకు చాలా ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ గారికి ఏమైంది? ఎందుకు సర్జరీ చేశారు? అంటూ చాలామంది అడుగుతున్నారు. గత నెల 27వ తేదీన ఆయన భుజానికి గాయమైంది. ఆయన కుడి భుజానికి సర్జరీ జరిగింది. ఈసీ జాయింట్స్ దగ్గర గాయం అయింది. దానికి సర్జరీ చేసాము. సర్జరీ పూర్తయిన తర్వాత ఆయన క్షేమంగా డిస్చార్జ్ అయ్యారు.. ప్రస్తుతం ఫిజియోథెరపీ స్టార్ట్ చేశాను. సర్జరీ జరిగింది అంటే ఎన్నో ఫిజియోథెరపీలు, రిహాబిలిటేషన్స్ ఉంటాయి. ఆయన చాలా డెడికేటివ్ పర్సన్. రెండు, మూడు నెలల్లో ఖచ్చితంగా ఆయన మళ్లీ బ్యాక్ అవుతారు అంటూ ఎన్టీఆర్ ఆరోగ్యంపై కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ డాక్టర్ ఇచ్చిన అప్డేట్ అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.

ఎన్టీఆర్ సినిమాలు..

Advertisement

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు . ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ సర్జరీ కారణంగా సినిమా వాయిదా పడుతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Related News

నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి తొలి అడుగు.. 36ఏళ్ల వయసులోనే ప్రముఖ నటి మృతి!

సినీ అభిమానులకు షాక్.. 27 ఏళ్లకే నటి అనన్యా కన్నుమూత!

56 ఏళ్ల సైఫ్.. 45 ఏళ్ల కరీనా.. లుక్ చూస్తే నమ్మడం కష్టమే!

అయ్యప్ప పాటలో రవితేజ మాస్ స్టెప్పులు.. ‘మల్లెపూల పల్లకి’ అదిరిపోయిందిగా!

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ

సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

Big Stories

Advertisement
×