E-Paper
Advertisement

యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ

యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ
Advertisement

Yash Rashmika:యష్ …వంద కోట్లే కష్టమనుకున్న శాండల్ వుడ్ కి ‘కేజీఎఫ్’ సిరీస్‌తో తొలిసారి వెయ్యి కోట్లని పరిచయం చేసిన టాప్ స్టార్.దాని తర్వాత చాలా గ్యాప్ తో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాలో నటించాడు.ఇక ఈ సినిమా kvn ప్రొడక్షన్స్  నిర్మించగా ఇందులో నయనతార, హ్యూమా ఖురేషీ, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్ , తారా సుతారియా వంటి లేడీ స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.

ఇక ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యష్ పలు ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.అందులో భాగంగా దాదాపు పదేళ్ళ క్రితం యష్ పై రష్మిక చేసిన కామెంట్స్ గూర్చి ప్రస్తావనకి రాగా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు ఈ రాఖీ భాయ్.మరింతకీ రష్మిక రాఖీ భాయ్ పై చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

రష్మిక ఏమన్నదంటే 

Advertisement

కిర్రాక్ పార్టీ అనే సినిమాతో 2016లో కన్నడ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ మొదలెట్టిన కొత్తలో  ఒక టీవీలో  పాల్గొంది.ఇక ఆ షోలోని ర్యాపిడ్ రౌండ్ లో ఇండస్ట్రీ లో ఎక్కువ షో ఆఫ్ చేసేది ఎవరు అన్న ప్రశ్నకి సమాధానంగా యష్ అని ఆన్సర్ ఇచ్చింది రష్మిక.పైగా మిస్టర్ షో ఆఫ్ అంటూ ఏకంగా బిరుదు కూడా ఇచ్చేసింది.దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు యష్ ఫ్యాన్స్.అంతటితో ఆగకుండా రష్మిక ని చెడా మడా ట్రోల్స్ తో ఎకిపారేశారు.

రష్మిక పై ఫ్యాన్స్ ఫైర్ 

ఇక ఈ ట్రోలింగ్ మరో లెవెల్ కి వెళ్లిపోవడంతో అబ్బే నేను కావాలని అనలేదు,ర్యాపిడ్ ఫైర్ లో సరదాగా అన్నానని ,ఎవరైనా హార్ట్ అయి ఉంటే క్షమించాలని వేడుకుంది .ఇక ఇదే విషయం పై అప్పట్లోనే యష్ రియాక్ట్ అవుతూ  రష్మిక ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని కూల్ గా ఫ్యాన్స్ కి చెప్పేశాడు.

కూల్ గా ఆన్సర్ ఇచ్చిన యష్ 

Advertisement

ఇక తాజాగా టాక్సిక్ ప్రమోషన్స్ లో మరోసారి ఇదే విషయాన్ని మీడియా యష్ ముందు ప్రస్తావించడంతో మరోసారి రియాక్ట్ అయ్యాడు .అదొక ర్యాపిడ్ ఫైర్ అని ,అందులో ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం ఇవ్వాల్సి ఉండటంతో అలా చేప్పిందని ,అయితే ఎవరైనా అలా అనుకుంటే అనుకోవచ్చు తప్ప అది నావ్యక్తిత్వం కాదని తేల్చి చెప్పేశాడు.ఇక ఇదే క్రమంలో నా అభిమానులు అనేవారు ఎవరైనా  ఇతర నటులని గౌరవిస్తారని,అలా కాకుండా ఎవరినైనా కించపరిచే విధంగా ట్రోల్ చేస్తే వాళ్ళది అభిమానమే కాదని క్లారిటీ ఇచ్చాడు.

also read :సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

టాక్సిక్ కి మరింత ప్రమోషన్ దొరికినట్టే

మొత్తంగా ఇపుడు స్టార్ స్టేటస్ వచ్చినప్పటికీ యష్  అప్పుడు  రష్మిక  చేసిన  కామెంట్స్ ని ఏ మాత్రం మనసులో పెట్టుకోకుండా హుందాగా వ్యవహరించడంతో యష్ మనసు మహా మంచిది అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు .మొత్తానికి అప్పుడెపుడో జరిగిన ఇష్యూ పదేళ్ళ తర్వాత మరోసారి వార్తల్లో హైలెట్ కావడంతో టాక్సిక్ కి మరింత ప్రమోషన్ దొరికినట్టే కనిపిస్తుంది .

Tags

Related News

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

అడివి శేష్ రిలీజ్ చేసిన ‘అ’.. రాహుల్ విజయ్ లుక్ చూస్తే మామూలుగా లేదు!

త్రిష ఆస్తుల లెక్క చూస్తే మైండ్ బ్లాక్.. ఇల్లు, కార్లు అన్నీ కోట్లలోనే!

విశ్వనాథ్ అండ్ సన్స్‌…అచ్చం అలాగే ఉందే!

బండ్ల గణేష్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి..వీడియో వైరల్

బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. ఆ హీరోలకు లీగల్ నోటీసులు…

Big Stories

Advertisement
×