E-Paper
Advertisement

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!

బన్నీ ఫ్యాన్స్‌కి హ్యాట్సాఫ్.. అమ్మాయిల కోసం ఇంత పెద్ద పని చేస్తున్నారా!
Advertisement

Allu Arjun Fans:అభిమాన హీరోలకి థియేటర్ల వద్ద కటౌట్స్ కట్టడమే కాదు..ఆ అభిమానాన్ని 10 మందికి మంచి చేయడానికి కూడా వాడతామంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.అవును అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా కలిసి ఇప్పుడు అమ్మాయిల ఆరోగ్యం కోసం HPV  వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది .

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి ,రెండు కాదు ఏకంగా ఏడు రాష్ట్రాల్లో 400 కు పైగా ప్రోగ్రామ్స్ నిర్వహించడం విశేషం.ఇక ఈ ప్రోగ్రామ్స్ ద్వారా దాదాపు లక్ష మందికి పైగా అమ్మాయిలకు HPV వ్యాక్సిన్‌  గురించి ,సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించనున్నట్లు తెలుస్తోంది.

సర్వైవల్ క్యాన్సర్ గురించి అవగాహన 

Advertisement

HPV విషయానికి వస్తే ఇదొక వైరస్.ఇందులో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు భవిష్యత్తులో సర్వైవల్ క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉందట. అందుకే చిన్న వయసులోనే HPV వ్యాక్సిన్ గురించి మహిళలకు, చిన్నపిల్లలకు ఈ కార్యక్రమంలో అవగాహన కలిపిస్తామంటూ తాజాగా పోస్టర్ వదిలింది AAFA టీమ్ .

దీని ప్రకారం సెప్టెంబర్ 8 9 తేదీల్లోఈ  కార్యక్రమాలను నిర్వహించనుందట అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్.ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో 9 నుంచి 26 ఏళ్ల వయసు అమ్మాయిలకు HPV వ్యాక్సిన్ గురించి  అవగాహన కల్పించనున్నారు.

అందరికంటే భిన్నంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్

Advertisement

మామూలుగా హీరోల అభిమానులు అంటే రక్త దానాలు, అన్నదానాలు వంటి  సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి .కానీ అందరికంటే భిన్నంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇలా ఒక మంచి అవేర్నెస్  కార్యక్రమాన్ని చేపట్టడం ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం.

అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏడు రాష్ట్రాలు ,400 పైగా కార్యక్రమాలు,లక్ష మంది అమ్మాయిలతో  1 Lakh Girls. One Bigger Future అంటూ ఇలా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తో మరోసారి అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది !ఇప్పటికే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తాడేమో అన్న ఊహాగానాల మధ్య ఇలాంటి కార్యక్రమాలు ఆ రూమర్స్ కి మరింత ఊతమిచ్చేలానే ఉన్నాయి .

బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులని కొల్లగొడుతుందో

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే గంగోత్రి తో మొదలెట్టిన సినీ ప్రయాణంలో ఆర్య, దేశ ముదురు ,పరుగు ,జులాయి ,రేసుగుర్రం ,సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంట పురం వంటి సినిమాలతో ఆడియన్స్ మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెల్సిందే.

also read :యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ

అయితే ఏ ముహూర్తాన సుక్కుతో పుష్ప సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో కాని ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టేశాడు.ఇక అదే జోష్ కంటిన్యూ చేస్తూ ఇపుడు అట్లీ తో రాకా సినిమాని పట్టాలెక్కించాడు. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులని కొల్లగొడుతుందో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×