E-Paper
Advertisement

నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి తొలి అడుగు.. 36ఏళ్ల వయసులోనే ప్రముఖ నటి మృతి!

నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి తొలి అడుగు.. 36ఏళ్ల వయసులోనే ప్రముఖ నటి మృతి!
Advertisement

Actress: ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే సెలబ్రిటీలు అభిమానులను వదిలి వెళ్ళడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. కొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిస్తే.. మరి కొంతమంది మరణానికి కారణాలు కూడా తెలియడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరొక నటి 36 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాలుగేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు అనూహ్యంగా తుది శ్వాస విడవడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆమె ఎవరు ? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి.. 36 ఏళ్లకే మరణం.

ఆమె ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటి హేడెన్ లెస్లీ పనేటియర్. అమెరికన్ నటి అయిన ఈమె సూపర్ హీరో సిరీస్ హీరోస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 1989 ఆగస్టు 21న న్యూయార్క్ లో జన్మించిన ఈమె మొదటిసారి 1990లో కేవలం 11 నెలల వయసులోనే వాణిజ్య ప్రకటనలో తెరపై కనిపించింది. ఇక పూర్తిస్థాయి నటన జీవితాన్ని మాత్రం 1994లో మొదలుపెట్టింది.అలా నాలుగు సంవత్సరాల వయసులో ఏబీసీ సోప్ ఒపేరా సిరీస్ అయినా వన్ లైఫ్ టు లివ్ లో సారా రాబర్ట్స్ పాత్రను 1997 వరకు పోషించింది. ఈ పాత్రతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె అకస్మాత్తుగా కన్నుమూశారు.ఈ విషయాన్ని ఆమె ప్రతినిధి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. హేడెన్ మరణం గురించి చెప్పడానికి మేము చింతిస్తున్నాము. ఈ సమయంలో మా కుటుంబానికి గోప్యత కలిగించండి అంటూ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈమె మరణానికి గల కారణం ఏమిటి అన్న విషయం పై మాత్రం స్పష్టత రాలేదు.

నమ్మిన ఫ్రెండే మోసం చేసింది..

Advertisement

ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేడెన్ కెరియర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి నోరు విప్పారు. తనకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక మహిళ ఇండస్ట్రీ ఫ్రెండ్ ను తనకు రక్షకురాలిగా , అత్యంత సన్నిహితురాలుగా భావించిందట. కానీ ఆ మహిళ ఆమెను ఒక ఉచ్చులోకి లాగినట్లు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఆ స్నేహితురాలు హేడెన్ ఒక పడవ మీదకు తీసుకెళ్లారు. ఆ పడవ సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత ఆమెను కింద ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లారట. అక్కడ బట్టలు లేకుండా ఉన్న ఒక అత్యంత ప్రసిద్ధ వ్యక్తి పక్కన బలవంతంగా పడుకోబెట్టారట. ఆ వ్యక్తితో కలవాలని తన స్నేహితురాలు సూచించినట్లు హేడెన్ ఆరోపించారు.

also read:బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ డాన్స్ చేసిన లక్ష్మీ నివాసం బ్యూటీ.. వీడియో వైరల్!

గత తాలూకు విషయాలు మళ్లీ వార్తల్లో..

Advertisement

ఆమె మాట్లాడుతూ..” నేను ప్రమాదంలో ఉన్నానని గ్రహించాను. ఇక అప్పటికే మేము సముద్రం మధ్యలో ఉన్నాం.. అక్కడి నుండి దూకి తప్పించుకునే పరిస్థితి లేదు. దాంతో నేను అతడికి లొంగిపోకుండా చాలా కోపంగా గట్టిగానే ప్రతిఘటించి తిరగబడ్డాను. ఇది జరగడానికి వీల్లేదు అని స్పష్టం చేశాను. ఆ గది నుంచి బయటకు వచ్చి పడవలో వేరే చోట దాక్కున్నాను” అంటూ ఆమె తెలిపింది. ఏది ఏమైనా గతంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు ఆమె మరణం తర్వాత ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా 36 ఏళ్ల వయసుకే హెడేన్ మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×