E-Paper
Advertisement

Power Peta: కృష్ణ చైతన్య దర్శకత్వంలో సందీప్ కిషన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?

Power Peta: కృష్ణ చైతన్య దర్శకత్వంలో సందీప్ కిషన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
Advertisement

Power Peta: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో సందీప్ కిషన్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన, టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో “పవర్ పేట” (Power Peta) అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ‘రౌడీ ఫెలో’, ‘చల్ మోహన్ రంగ’, ఇటీవల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో తనదైన ముద్ర వేసిన కృష్ణ చైతన్య, ఈ చిత్రాన్ని తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

Read also-Kodava Wedding: ‘విరోష్’ వివాహంలో కొడవ సంప్రదాయాల వెనుక ఉన్న విశిష్టత ఇదే?.. దాన్ని నరకాల్సిందేనా?

సందీప్ కిషన్ సరసన రితికా నాయక్

Advertisement

ఈ సినిమాలో కథానాయికగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న రితికా నాయక్ నటిస్తోంది. సందీప్ కిషన్, రితికా నాయక్ జంట మొదటిసారి వెండితెరపై కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే తెజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఇప్పటికే సందీప్ కిషన్ విజయ్ దళపతి కుమారుడు జాసన్ విజయ్ తో సిగ్మా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీ గా ఉండగా.. సందీప్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

సినిమా ప్రత్యేకతలు

ఒక సామాన్యుడు అసాధారణమైన శక్తిగా ఎలా ఎదిగాడు? ఒక ప్రాంతాన్ని శాసించే స్థాయికి అతను చేరుకున్న ప్రయాణం ఏమిటి? అనే పాయింట్‌పై ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రం కోసం సందీప్ కిషన్ తన బాడీ లాంగ్వేజ్‌ని, లుక్‌ని పూర్తిగా మార్చుకోబోతున్నారు. కథలో భాగంగా ఆయన మూడు విభిన్న వయస్సులలో కనిపిస్తారని సమాచారం. సందీప్ కిషన్ కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటి. పీరియడ్ డ్రామా కావడంతో ఆర్ట్ వర్క్ మరియు సెట్టింగ్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Advertisement

Read also-Supernatural comedy Movie OTT: వాక్యూమ్ క్లీనర్ లో ఆత్మ… చచ్చినా వదలని భార్య

దర్శకుడు కృష్ణ చైతన్య మార్క్

కృష్ణ చైతన్య రాసుకున్న కథల్లో ఎమోషన్ తో పాటు డార్క్ హ్యూమర్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ‘రౌడీ ఫెలో’లో పోలీస్ వ్యవస్థను, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రాజకీయ రౌడీయిజాన్ని చూపించిన ఆయన, “పవర్ పేట”లో అంతకు మించిన ఇంటెన్సిటీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై గతంలో చాలా చర్చలు జరిగినప్పటికీ, ఫైనల్ గా సందీప్ కిషన్ ఈ కథకు ప్రాణం పోయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటనకు, కృష్ణ చైతన్య మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయం.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×