Sunny leone : సన్నీ లియోన్.. ఒకప్పుడు నీలి చిత్ర ప్రపంచంలోకి అడుగుపెట్టి తన కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ ఊబి నుండి బయటపడి సాఫ్ట్ హీరోయిన్ గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో, ప్రత్యేకమైన పాత్రలతో అలరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. అప్పుడప్పుడు ఆపదలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసున్న అమ్మాయిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ఇప్పటికే ఒకసారి యూ టర్న్ తీసుకున్న సన్నీలియోన్.. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సన్నీలియోన్ తాజాగా నిర్మాతగా తన ప్రయాణంలో యూ టర్న్ తీసుకోబోతున్నట్లు సమాచారం. విక్రమాదిత్య మోత్వానే (Vikramaditya Motwane) దర్శకత్వంలో వస్తున్న ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కి ఈమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ ప్రాజెక్టుతో తన ప్రయాణం మొదలవుతోంది అంటూ సన్నీలియోన్ తెలిపారు. ఈ విషయాన్ని సన్నీలియోన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేసింది.
ఎమోషనల్ నోట్ పంచుకున్న సన్నీలియోన్..
“ఈ వెబ్ సిరీస్ నిజజీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. నేను స్క్రిప్ట్ వినగానే ఇది ఎంతో స్ఫూర్తినిచ్చే కథ అనిపించింది. ఇలాంటి గొప్ప కథతో నిర్మాతగా నా కొత్త ప్రయాణం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది” అంటూ సన్నీలియోన్ తెలిపింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. నటీనటుల ఎంపికతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై కూడా బృందం తీవ్రంగా శ్రమిస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో విడుదల..
అంతేకాదు ఈ సిరీస్ ను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.పైగా ఈ కంటెంట్ లో సానుభూతి, గ్లోబల్ టచ్, వాస్తవికత ఉండేలా దర్శకుడు విక్రమాదిత్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇప్పటివరకు గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఒక సీరీస్ తో నిర్మాతగా మారాలని అడుగులు వేస్తోంది. మరి నిర్మాతగా ఈమెకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.
సన్నీలియోన్ కెరియర్..
సన్నీలియోన్ కెరియర్ విషయానికి వస్తే.. భారతీయ సంతతికి చెందిన ఈమె తండ్రి టిబెట్ లో పుట్టినా సిక్కు మతస్తుడైన ఈయన ఢిల్లీలో పెరిగారు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వారు. 1981 మే 13న జన్మించిన సన్నీ లియోన్ అసలు పేరు కరేన్ మల్హోత్రా . ఈమె జన్మించక ముందే ఈమె కుటుంబ సభ్యులు కెనడాలో స్థిరపడిపోయారు. చిన్నతనంలోనే పాటలు పాడడం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్ వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి కనబరిచేది.
హిందీ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు..
1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది.. 2011లో జరిగిన బిగ్ బాస్ సీజన్ 5 వంటి రియాల్టీ షో లలో కూడా పాల్గొన్న ఈమె బాలీవుడ్ నటిగా అవకాశం అందుకున్న తర్వాత జిస్మ్ 2 సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో కరెంటు తీగ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత పిఎస్వి గరుడవేగ, జిన్నా, మందిర వంటి చిత్రాలలో నటించింది.
also read:OG Premiere : తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. ఓజీ సినిమాపై గందరగోళం!