CM Chandrababu: రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజా వేదిక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యువత చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా.. పెట్టుబడులు తీసుకొస్తామని సీఎం యువతకు భరోసానిచ్చారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే తమ ధ్యేయమని చెప్పారు. అందుకే 64 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
⦿ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15వేలు..
‘ఆటో డ్రైవర్లకు రూ.15వేలు దసరా కానుకగా ఇస్తున్నాం.. సూపర్ సిక్స్- సూపర్ హిట్ అయ్యింది.. పన్నులు తగ్గడంతో నిజమైన దసరా, దీపావళి వస్తోంది.. ఇద్దరికి ఫించన్లు ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇప్పుడు జీఎస్టీలో రెండు స్లాబులు మాత్రమే ఉన్నాయి. పాలు, బ్రెడ్ పన్నులు కూడా ఇప్పుడు తగ్గాయి. పాలు, వెన్న, ఏసీ, తృణధాన్యాలు, ట్రాక్టర్లు, ఇంటి నిర్మాణ వస్తువులు ఇలా అన్ని ట్యాక్స్ లు తగ్గాయి’ అని సీఎం పేర్కొన్నారు.
⦿ పిల్లలను బాగా చదివించాలన్నదే నా ధ్యేయం..
‘ప్రజల చైతన్యం కోసం అవగాహన కార్యక్రమం తెస్తున్నాం. శాశ్వత పేదరికంలో ఉండాలన్న ఆలోచన మారాలి. ఆడబిడ్డలు చదువుకుంటే నాకంటే ఆనందపడే వారు ఎవరూ ఉండరు. రాష్ట్రంలో పిల్లలను బాగా చదివించాలన్నదే నా ధ్యేయం. ఆ రోజు నా మాట విని ఐటీ చదివిన పిల్లలు.. పెద్ద ఎత్తున విదేశాల్లో రాణిస్తున్నారు. కొందరు ఉట్టి మాటలు, చెత్త కబుర్లు చెబుతుంటారు.. చరిత్ర రాయాలన్నా, తిరగ రాయాలన్నా టీడీపీ వల్లే అవుతోంది’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
⦿ ఇప్పుడు అంతా స్మార్ట్ వర్కే…
దయ చేసి వైకుంఠ పాళి ఆడొద్దు.. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది.. ఇప్పుడంతా స్మార్ట్ వర్క్ ప్రభావమే.. ఇప్పుడు ఎవరి దయా దాక్ష్యాలు అవసరం లేదు. అంతా వాట్సాప్ గవర్నెర్స్.. మీరు సమాచారం నాకు ఇవ్వండి.. నేను వారిని నిలదీస్తా.. రాజకీయ నాయకులు, అధికారులు పేదలను వేధించకండి.. 730 సేవలు వాట్సాప్ ద్వారా ఇస్తున్నాం.. పరిశుభ్రమైన గ్రామాల కోసం పవన్ సైతం పని చేస్తున్నారు.. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి చెత్త మొత్తం తొలగించాల్సిందే’ అని అన్నారు.
⦿ మీకో వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి..
చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి. చెత్తతో సంపద సృష్టి చేసే అవకాశం ఉంది. రేపో మాపో మీ ఇంటికి వాహనాలు వస్తాయి. మీకు ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి. చెత్త నుంచి కరెంట్, కాంపోస్ట్ వెలికి తీస్తున్నాం.. దీని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే కొన్ని ప్లాంట్లున్నాయి. కొత్త ప్లాంట్లు కూడా వస్తాయి. ప్లాస్టిక్ ఫ్రీ ఏపీగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్నాం’ అని చంద్రబాబు అన్నారు.
⦿ అతిగా ఫోన్ చూడొద్దు..
అదే పనిగా సెల్ ఫోన్ చూడొద్దు.. ఆ సమయంలో ఒక చెట్టు నాటండి. అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే.. మెంటల్ సిక్ నెస్ ఒక ఎత్తు.. ఆధునిక యుగంలో సెల్ ఫోన్ ద్వారా కూడా స్ట్రెస్ వస్తోంది. అందుకే యోగా లాంటి వాటిని అలవాటు చేసుకోవాలి. మొన్న యోగాంధ్ర ఎంత హిట్ అయ్యిందో చూశారు కదా’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ALSO READ: OG Pre Release Event: రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్… పవన్ కోసం రెండు స్టేజ్‌లు.. అసలు సంగతేంటంటే ?