E-Paper
Advertisement

New Year Event Cancel: న్యూ ఇయర్ ఈవెంట్స్.. సన్నీలియోన్ ఈవెంట్‌కి సాధువుల ఝలక్, ఏం జరిగింది?

New Year Event Cancel: న్యూ ఇయర్ ఈవెంట్స్.. సన్నీలియోన్ ఈవెంట్‌కి సాధువుల ఝలక్, ఏం జరిగింది?
Advertisement

New Year Event Cancel: న్యూ ఇయర్ వచ్చిందంటే ఆ మజాయే వేరు. ఒకరోజు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా సందడి మొదలవుతుంది. చిన్నారులు, పెద్దలు రోడ్లపైకి వచ్చి న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈవెంట్ల ఆర్గనైజర్స్ హీరోయిన్లతో షోలను ఏర్పాటు చేస్తుంటారు. న్యూఇయర్‌కి ముందు రోజు రాత్రి ఓ షోకు సన్నీలియోన్ హాజరు కావాల్సి ఉంది. ఆమె రాకను సాదువులు అడ్డుకోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఇంతకీ ఎక్కడో తెలుసా?

సన్నీలియోన్ న్యూఇయర్ ఈవెంట్‌కి సాధువుల ఝలక్

Advertisement

యూపీలోని మధురలో కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలు గ్రాండ్‌గా చేయాలని కొందరు భావించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఆఫర్ వచ్చింది. అందుకు ఆమె ఓకే చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని డీజే ప్రదర్శనగా ప్లాన్ చేశారు. దీనికి అన్నిరకాల చట్టపరమైన అనుమతులు తీసుకుంటామని అన్నారు.

ఈ డీజే షోను కేవలం 300 మందికి పరిమితం చేయాలని భావించారు. జనవరి ఒకటిన రాత్రి 8 గంటల నుంచి  అర్ధరాత్రి వరకు నిర్వహించాలని భావించారు. ఆపై టికెట్ల అమ్మకాలు సాగించారు. హట్, కాబానా, హై టెర్రస్ సీటింగ్, స్టాండింగ్ వంటి నాలుగు సీటింగ్ విభాగాలను ఏర్పాటు చేశారు.  సన్నీ  షో గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయం తెలియగానే స్థానికులు, సాధువులు, ఆధ్యాత్మిక సంఘాల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి.

Advertisement

మధురలో ఈవెంట్‌ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు, సాధువులు, స్థానికులు జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాశాయి. శ్రీకృష్ణుడు జన్మించిన మధుర వంటి ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు తగవని, నిర్వాహకులు అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో నిర్వాహకులు సన్నీ ఈవెంట్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మతపరమైన భావాలను, సాంస్కృతికను గౌరవించడం ముఖ్యమైనదని పేర్కొన్నారు.  సన్నీ‌లియోన్‌ని కేవలం ఆర్టిస్ట్‌గా ఆహ్వానించామని అన్నారు.  స్థానిక ఆచారాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ALSO READ:  అఖండ 2 క్లోజింగ్ కలెక్షన్స్.. ఇయర్ చివరలో బిగ్గెస్ట్ డిజాస్టర్

న్యూ ఇయర్ అంటే డిసెంబర్ 31 రాత్రికి పలు హోటళ్లు, ఈవెంట్స్ ఆర్గనైజర్లు హీరోయిన్లతో ప్రత్యేకంగా షోలను ఏర్పాటు చేస్తుంటారు. అందుకోసం నటీమణులు బాగానే ఛార్జ్ చేస్తారు. గతంలో ఈ తరహా ఈవెంట్లు జరిగాయి.. చాలామంది హీరోయిన్లు హాజరయ్యారు. అయితే సన్నీలియోన్ ఈవెంట్‌ని నేరుగా మధురలో ఏర్పాటు చేయడం, ఆపై వివిధ సంఘాల నుంచి నిరసనలు రావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. న్యూఇయర్ రాకముందే సన్నీలియోన్‌కి ఊహించని ఝలక్ తగిలిందని సినీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×