Kangana Ranaut:కంగనా రనౌత్ (Kangana Ranaut).. బాలీవుడ్ బ్యూటీగా.. ఫైర్ బ్రాండ్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్ల వల్ల చిక్కుల్లో పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఈమె చేసిన ఒక చిన్న తప్పిదాన్ని.. ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయగా.. అందుకు సుప్రీంకోర్టు ఏకంగా కంగనా రనౌత్ పై మండిపడుతూ ఆమె పిటీషన్ ని కూడా రద్దు చేసింది. మరి కంగనా చేసిన తప్పేంటి? సుప్రీంకోర్టు ఎందుకు ఆమెపై మండిపడింది? ఆమె పిటిషన్ వేయడం వెనుక అసలు కారణం ఏమిటి? ఇలా కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కంగనా ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు బిజెపి తరఫున మండి ప్రాంతానికి ఎంపీగా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాంటి ఈమె అటు సినిమాల ద్వారానే కాకుండా ఇటు రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ చిక్కుల్లో పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమెపై సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైంది. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో కంగనా రనౌత్ రైతులను ఉద్దేశించి.. రైతుల ఉద్యమంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఈమెపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ కంగనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే నేడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరుపుతూ.. ఇది “కేవలం రీ ట్వీట్ కాదు.. దీనికి మసాలా జోడించారు” అంటూ ధర్మాసనం ఈమెపై మండిపడింది. ఈ క్రమంలోనే ఈమె వేసిన పిటీషన్ ని కూడా కొట్టివేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ALSO READ:Anushka Shetty: వాస్తవ ప్రపంచం అదే.. అనుష్కలో ఈ మార్పుకి కారణం?
అసలేం జరిగిందంటే?
అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. 2020 – 21 దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మహీందర్ కౌర్ అనే 73 ఏళ్ల మహిళ రైతుపై వంద రూపాయల కోసం నిరసనల్లో పాల్గొన్నారు అంటూ కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . దీనిని ఆమె రీ ట్వీట్ చేయడంతో ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు అయింది. దీంతో తనపై వేసిన కేసును కొట్టివేయాలి అని హైకోర్టును ఆశ్రయించింది కంగనా రనౌత్ . కానీ అక్కడ ఈమెకు చుక్కెదురయింది. దీంతో హర్యానా న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కంగనా. అయితే అక్కడ కూడా ఈమెకు నిరాశ తప్పలేదు అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఒక్క రీ ట్వీట్ కారణంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసును ఎదుర్కోవడం నిజంగా సంచలనంగా మారింది. మరి దీనిపై కంగనా ఎలాంటి కామెంట్లు చేస్తుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.