Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు హామీలు ఇవ్వలేనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో.. లేదో.. తెలియని పరిస్థితి నెలకొందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందుకే తాను ఎవరికీ హామీలు ఇవ్వలేనని వ్యాఖ్యానించారు. కాకపోతే తన వంతుగా ప్రజల కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రి జూపల్లి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు జూపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి..? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని..? పలువురు మాట్లాడుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన నియోజకవర్గ ప్రజలకు కూడా హామీలు ఇవ్వనని అన్నారు. ప్రజలకు ఎలాంటి పనులు కావాలో వాటిని మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల మధ్యే జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
ALSO READ: KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా అంటూ..?
త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూపల్లి వ్యాఖ్యలు ప్రజల్లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత నిరాశను కలిగించేలా ఉన్నాయి. ఆయన స్వయంగా తన గెలుపుపై సందేహం వ్యక్తం చేయడం ఏంటని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి జూపల్లి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశం ఏమై ఉండవచ్చు? ఇది కేవలం ఆత్మవిశ్వాస లోపమా..? లేక ప్రతిపక్షాలను రెచ్చగొట్టే ఉద్దేశమా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.
ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం