Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తెలుగు వాళ్లు ఈయనను దత్తపుత్రుడు అని పిలుస్తారు. గజినీ సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు సూర్య. ఆ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఇక గజినీ తరువాత సూర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన నటించిన ప్రతి తమిళ్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. అలా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ ఒక్కో సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. కేవలం సినిమాల పరంగానే కాదు. సమాజ సేవ చేస్తుంటాడు. ఈయన ఒక ఫౌండేషన్ ను స్టార్ట్ చేసి ఎంతో మంది విద్యార్థులను ప్రతిభా వంతులను చేస్తున్నాడు. తాజాగా ఈయన ఫౌండేషన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘అగరం ఫౌండేషన్’ ద్వారా వేల మందికి సాయం..
హీరో సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మందిని చదివిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన కళాశాల విద్యను అందిస్తున్న అగరం ఫౌండేషన్‌లో చేరి విద్యా సహాయం పొందుతూన్నారు. వైద్యం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం వంటి ఏ కోర్సు చదవాలనుకున్నా, వారికి అగరం ఫౌండేషన్ మద్దతు అందించి చదివిస్తుంది.. దీన్ని చెన్నైలోని టి. నగర్‌లో 2006, సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం అందించడం.. ఈ ఫౌండేషన్ ద్వారా సాయం పోంది 51 మంది డాక్టర్లు, 1800 ఇంజనీర్లు అయ్యారు..
చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న సూర్య..
మెగాస్టార్ చిరంజీవి రక్త నిధి కేంద్రాన్ని చూసి, ఏదైనా చేయాలని సూర్య భావించి అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించారని తరచుగా చెబుతారు. చిరంజీవి స్ఫూర్తితో ఇప్పటివరకు 8 వేల మంది మొదటి తరం గ్రాడ్యుయేట్ విద్యార్థులను అగరం ఫౌండేషన్ తయారు చేసిందని నటుడు సూర్య ఆ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకలో అన్నారు..15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఆదివారం వేడుక నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ హాజరయ్యారు. ఆయన సూర్యకు మరోసారి అభినందనలు తెలిపారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.ఇప్పటికీ ఎన్నో వేలమంది ఈ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు..
Also Read : కన్నడ హారర్ మూవీ తెలుగులోకి వచ్చేస్తోంది.. ట్రైలర్‌తోనే హిట్ కళ కనిపిస్తోంది..
సూర్య సినిమాలు..
హీరో సూర్య ఒక వైపు సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రెట్రో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. గత ఏడాది వచ్చినా కంగువా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.. రెట్రో సినిమాతో కాస్త ఊరట కలిగింది. ప్రస్తుతం ఓ రెండు మూడు భారీ ప్రాజెక్టులలో సూర్య నటిస్తున్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..
In 2006,#Surya started #AgaramFoundation with one goal education for the deserving. Today, over 8000 students have been empowered, including 51 doctors and 1800 engineers. pic.twitter.com/2BJaYdDm5E
— Addicted To Memes (@Addictedtomemez) August 5, 2025