Hansika: అందాల హాట్ బ్యూటీ హన్సిక మోత్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సీనియర్, జూనియర్ హీరోల సరసన మంచి మంచి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హన్సిక తెలుగులో ఎక్కువగా రాణించలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ తన లక్ ను పరీక్షించుకోవడానికి వెళ్ళింది. అక్కడ శింబుతో కొన్నేళ్లు ప్రేమాయణం నడిపి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆ హీరోతో బ్రేకప్ కారణంగా కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైన హన్సిక.. బరువు తగ్గి సన్నజాజి తీగలా మారిమరోసారి ఇండస్ట్రీని షాక్ గురి చేసింది.
ఇక దీనివల్ల హన్సిక వరస సినిమాలతో బిజీగా మారుతుంది అనుకున్నారు. కానీ అమ్మడికి మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో చేసేదేమీ లేక హన్సిక పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యింది. అయితే ఈ పెళ్లి విషయంలో కూడా ఆమె వివాదాలను ఎదుర్కొంటూనే వచ్చింది. హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ భర్త ఆయన సోహైల్ కతూరియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాం 2022 డిసెంబర్ లో అత్యంత ఘనంగా జరిగింది. సోహైల్ తో హన్సిక వివాహం లవ్ షాది డ్రామా అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ గా కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా హన్సిక ఇంకోపక్క బుల్లితెరపై ఢీ డాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక అంతా బాగుంది అనుకున్న క్రమంలో హన్సిక- సోహైల్ మధ్య విభేదాలు తలెత్తాయని, హన్సిక ప్రస్తుతం తల్లి గారి ఇంట్లోనే ఉంటుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై హన్సిక ఇప్పటివరకు స్పందించింది లేదు కానీ, సోహైల్ మాత్రం వార్తలు బయటకొచ్చిన రెండు రోజులకే స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామిద్దరం సంతోషంగానే ఉన్నామని, అలాంటి పుకార్లు పుట్టించవద్దని కోరాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
అయితే మరోసారి హన్సిక విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దానికి కారణం హన్సికనే. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లోని పెళ్లి ఫోటోలను డిలీట్ చేసింది. తన భర్త సోసోహైల్ తో ఉన్న ఏ ఒక్క ఫోటోను వదలకుండా అన్నిటిని ఆమె డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే మీరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిందని సమాచారం. ఇటీవల గార్డియన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన హన్సిక ప్రస్తుతం శ్రీ గాంధారి అనే సినిమాతో ప్రేక్షకుల ముదుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి.