Bad Girlz : ప్రదీప్ మాచిరాజు- అమృత అయ్యర్ (Pradeep Machiraju- Amritha Aiyer) లు జంటగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా(30 Rojullo Preminchadam Ela) సినిమాకి దర్శకత్వం వహించి, టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయాడు దర్శకుడు మున్నా.. అయితే అలాంటి డైరెక్టర్ సరికొత్త కథాంశంతో ‘బ్యాడ్ గర్ల్స్’ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ డైరెక్టర్ నీలి నీలి ఆకాశం అనే బ్యానర్ ని ఫ్రెండ్స్ తో కలిసి స్థాపించి.. సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం బ్యాడ్ గర్ల్స్(Bad Girlz). కానీ చాలా మంచోళ్ళు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
బ్యాడ్ గర్ల్స్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్..
అయితే ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ లో డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti), డైరెక్టర్ శివ నిర్వాణ, కృష్ణ చైతన్యలు చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ఇందులో నటించిన నలుగురు హీరోయిన్లు మొదట సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపించి.. సడన్గా బట్టలు విప్పేసి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో ఈ వీడియో చూసిన చాలామంది షాక్ అయిపోతున్నారు. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. మున్నా (Munna) దర్శకత్వం వహిస్తున్న ‘ బ్యాడ్ గర్ల్స్: కానీ చాలా మంచోళ్ళు’ అనే సినిమాలో నలుగురు హీరోయిన్లను తీసుకున్నారు. రోషిణి (Roshini), అంచల్ గౌడ(Anchal Gouda), యష్ణ(Yashna),పాయల్ చెంగప్ప(Payal Chengappa) లు హీరోయిన్ లుగా చేస్తున్న ఈ సినిమాలో రోహన్ సూర్య(Rohan Surya) కీరోల్ పోషిస్తున్నారు.
స్టేజ్ పైనే బట్టలు విప్పిన హీరోయిన్స్..
అయితే ఈ సినిమా లో ఫస్ట్ బెంచ్ లో ఉండే అమ్మాయిలు మొదటి నుండి చాలా పర్ఫెక్ట్ గా ఉండి, ఒక మూడు నాలుగు రోజులు బ్యాడ్ గర్ల్స్ గా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారట డైరెక్టర్ మున్నా.. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ ప్రెస్మీట్ లో నలుగురు హీరోయిన్లు స్టేజి మీదకి వచ్చి మొదట ఒంటినిండా డ్రెస్ లు వేసుకొని .. ఆ తర్వాత సడన్గా నలుగురు ఒంటి మీద ఉన్న డ్రెస్సులు విప్పడంతో అందరూ షాక్ అయ్యారు.అయితే లోపల బ్యాడ్ గర్ల్స్ అనే మూవీ టైటిల్ ఉన్న టీ షర్ట్ లతో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ హీరోయిన్స్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు అసలు వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
బ్యాడ్ గర్ల్స్ మూవీపై డైరెక్టర్ కామెంట్..
ఇక బ్యాడ్ గర్ల్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ కి చీఫ్ గెస్ట్లుగా వచ్చిన దర్శకులు చందు మొండేటి, శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్టర్ మున్నా గురించి గొప్పగా మాట్లాడారు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే పాట ఎంత హిట్ అయిందో.. అలాంటి ఒక పాటనే బ్యాడ్ గర్ల్స్ మూవీ లో కూడా ఉంది. అలాగే ఈ సినిమా హిట్ అయ్యి మున్నాకి బాగా డబ్బులు రావాలంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అలాగే బ్యాడ్ గర్ల్స్ మూవీకి చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించగా.. అనూప్ రూబెన్స్(Anup Rubens) సంగీతం అందిస్తున్నారు.
#BadGirlz rocked the stage with electrifying energy & an unmatched vibe!❤️🔥
Directors @chandoomondeti, @ShivaNirvana, and #KrishnaChaitanya unveiled the title and wished blockbuster success to the entire team💥
▶️ https://t.co/Q6vuMPZQLS@DirectorMunna1 @Teju_PRO pic.twitter.com/0OKey9bQ5o
— Karthik💛 (@Anchor_Karthik_) August 8, 2025
also read: Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?