AP development: ఏపీలో మళ్లీ అభివృద్ధికి పూనకం వచ్చింది. పెట్టుబడుల పరంగా మరో భారీ దూకుడు.. ప్రజలకు నూతన ఆశలు.. యువతకు ఉద్యోగ అవకాశాలు.. అన్ని రంగాల్లో పెట్టుబడుల వర్షం కురుస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక పండగ వాతావరణమే కనిపిస్తోంది. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. అదేమిటో తప్పక తెలుసుకోండి.
ఏపీ అభివృద్ధి రధచక్రాలు వేగంగా తిరుగుతున్నాయ్. రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పెట్టుబడిదారులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) ఇటీవలే 22 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.39,473 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబోతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 30,899 మంది నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. JSW, ReNew Power, Lulu Group, Laurus Labs, Greenlam, Axelent India లాంటి దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఐటీ, ఎనర్జీ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఉండడం విశేషం. ఇప్పుడు కేవలం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదమే మిగిలి ఉంది.
ఈ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైనవి రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినవి. హిందూపురం, కాకినాడ, వైఎస్ఆర్ జిల్లాల్లో సోలార్, విండ్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ReNew Power సంస్థ రూ.13,300 కోట్లతో 2,000 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. JSW ఎనర్జీ కూడా రూ.8,000 కోట్లతో గ్రీన్ ప్రాజెక్టులను చేపట్టనుంది.
మరోవైపు, లులూ గ్రూప్ విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. టూరిజం మరియు రిటైల్ రంగాలపై దృష్టి పెట్టిన లులూ, రూ.4,000 కోట్లతో మల్టీ స్పెషల్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఇక లారస్ ల్యాబ్స్ అమీనాబాద్‌లో రూ.1,000 కోట్లతో ఫార్మాస్యూటికల్స్ మానుఫాక్చరింగ్ యూనిట్ నిర్మించబోతోంది. గ్రీన్ లామ్ ఇండస్ట్రీస్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రూ.950 కోట్లతో డెకోరేటివ్ ఫినిషింగ్ ప్యానల్స్ ప్లాంట్ నిర్మించనుంది.
Also Read: Visakhapatnam city: విశాఖ ది గ్రేట్ అంటారు ఇందుకేనేమో.. ఎందుకో తప్పక తెలుసుకోండి!
ఇంకా విశేషమేంటంటే, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అన్ని జిల్లాలకూ సమాన న్యాయం కలిగేలా ప్రాజెక్టుల పంపిణీ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ప్రాజెక్టులు అభివృద్ధిని తెచ్చేలా మంత్రివర్గ అంగీకారాన్ని ఎదురుచూస్తున్నాయి.
అయితే, అభివృద్ధికి పెనువేస్తున్న ఈ ప్రాజెక్టులు మరొక ప్రశ్నను కూడా రేపుతున్నాయి.. నగరాల్లో రాత్రివేళ ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, తాడేపల్లి, కర్నూలు వంటి నగరాల్లో ట్రక్కులు, నిర్మాణ సామాగ్రి వాహనాల తాకిడి రాత్రి పూట ఎక్కువవుతోంది. అభివృద్ధికి దారి కానివి రోడ్లే అన్నంతగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు నిలిపివేసే స్థలాల కొరత, లైన్ లో ఆగుతున్న హెవీ వెహికిల్స్ కారణంగా చిన్న వాహనాలు సాగరాకుండా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి.
ఈ సమస్యలపై ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్యూటీలు వేస్తున్నా, రాత్రి వేళ వాహనాల ఒత్తిడి అదుపులోకి రాలేదన్నది వాస్తవం. అభివృద్ధి దిశగా వేగంగా పరుగులు తీస్తున్న రాష్ట్రానికి తోడుగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను కూడా సమర్థవంతంగా అమలు చేస్తేనే ప్రజలకు పూర్తిస్థాయి ప్రయోజనం లభిస్తుందన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి, SIPB ఆమోదించిన ఈ 22 ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్త శకాన్ని తెచ్చే అవకాశముంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఏపీకి ఇక వెనుకడుగు అన్నది లేనట్టే!