Tamannaah Bhatia: తమన్నాకి భాటియా కేవలం తెలుగులోనే కాకుండా ప్రస్తుతం ఇండియా వైట్ గా మంచి గుర్తింపు లభించింది. దీనికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో తమన్నా నటించడం. వాస్తవానికి ముందు బాహుబలి సినిమాకి తెలుగులో పాజిటివ్ టాక్ రాలేదు. కానీ నార్త్ లో మాత్రం అదిరిపోయే టాక్ వచ్చింది. ఈ టాక్ తో సినిమా ఫేట్ మారిపోయింది. అలానే తెలుగు సినిమా స్థాయి కూడా విపరీతంగా పెరిగిపోయింది.
ఇక తమన్నా విషయానికి వస్తే బాహుబలి (Baahubali) కంటే ముందు తెలుగులో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ సంపాదించుకుంది. తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. కానీ ఒకప్పుడు వరుస సినిమాలు వచ్చేవి. తమన్నా ఇప్పుడు ఏ సినిమా చూసిన అంతమంది చూడడం మొదలుపెట్టారు. కేవలం సినిమాల్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ కూడా తమన్నాది అదిరిపోద్ది.
ఉత్తరప్రదేశ్ లో ఊపు
చాలా సందర్భాలలో తమన్నా స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమాల్లో మాదిరిగానే తన ఎనర్జీ లెవెల్ ఎక్కడ తగ్గవు. తాజాగా ఉత్తరప్రదేశ్ t20 లీగ్ ఓపెనింగ్ ఈవెంట్ లో తమన్నా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. జైలర్ సినిమాలో కావాలయ్యా పాటకు పర్ఫార్మ్ చేశారు. ఈ పర్ఫామెన్స్ కు తమన్నా ఎనర్జీ లెవెల్స్ కు అందరూ ఆశ్చర్య పడుతున్నారు. ఒక్కసారిగా అందరినీ తన వైపు తిప్పుకుంది తమన్నా. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ రూపంలో షేర్ అవుతుంది. సినిమాలో ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అనిరుద్ (anirudh Ravichandran) అంత పవర్ ఫుల్ గా ఈ పాటను కంపోజ్ చేశాడు. నెల్సన్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్ (Rajinikanth) జైలర్ (jailer) సినిమాలో కూడా పాట పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది.
పర్ఫెక్ట్ లైనప్
రీసెంట్ గా ఓదెల 2 (Odhela 2) సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది తమన్నా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ కొంతమేరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. మరోవైపు హిందీలో నటించిన రైడ్ 2 సినిమా కూడా ఊహించిన సక్సెస్ అందించలేదు. ఇక ప్రస్తుతం మరో మూడు సినిమాలు తమన్న లైనప్ లో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తమన్నా పెద్దగా కనిపించకపోయినా కూడా తను చేసే పర్ఫామెన్స్ వలన ప్రేక్షకులకి ఎప్పటికీ దగ్గరగానే ఉంటుంది.
Also Read: Telugu Film Producers : తగ్గుతున్న నిర్మాతలు… ఈ డిమాండ్స్‌కు గ్రీన్ సిగ్నల్… ఇక సమ్మె బంద్ ?