Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ను అధికారులు రద్దు చేశారు. ఈ సంఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. హోం మంత్రికి తెలియకుండానే శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారు. ఓ ఉన్నతాధికారి సూచన మేరకు హోం సెక్రటరీ ఈ పెరోల్ ను మంజూరు చేశారు. అయితే.. ఈ పెరోల్ వెనుక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పెరోల్ మంజూరు అయిన తర్వాత రౌడీ షీటర్ శ్రీకాంత్ ఓ ఎమ్మెల్యేను సైతం కలిసినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వంలో కీలక అధికారి సూచనతో.. రౌడీ షీటర్ కు పెరోల్ ఇచ్చినట్టు హోం మంత్రి అనితకు హోం సెక్రటరీ తెలిపారు. ఈ క్రమంలోనే హోం మినిస్టర్ పెరోల్ రద్దు చేసి విచారణకు ఆదేశించారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాష్ర ప్రభుత్వం కూడా సీరయస్ గా ఉంది.
ALSO READ: Rajasthan News: లవర్‌తో కలిసి భర్తను దారుణంగా చంపి.. డ్రమ్ములో పడేసి పరార్.. చివరకు ఏమైందంటే?
ALSO READ: Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..