BigTV English

Telugu film producers : తగ్గుతున్న నిర్మాతలు… ఈ డిమాండ్స్‌కు గ్రీన్ సిగ్నల్… ఇక సమ్మె బంద్ ?

Telugu film producers : తగ్గుతున్న నిర్మాతలు… ఈ డిమాండ్స్‌కు గ్రీన్ సిగ్నల్… ఇక సమ్మె బంద్ ?

Telugu film producers : గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. దీనికి కారణం సినిమా కార్మికులు తమ వేతనాలు 30% వరకు పెంచాలి అంటూ డిమాండ్ చేయటం. మరోవైపు నిర్మాతలు దానికి ఒప్పుకోకపోవడం. ఈ పంచాయతీ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. దీనివలన చాలా సినిమాలు రిలీజ్ డేట్ లో కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకున్న టైం కి షూటింగ్ జరగకపోతే రిలీజ్ డేట్స్ లో తేడా ఖచ్చితంగా వస్తుంది.


ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని క్లియర్ చేయడానికి ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు పెద్ద వ్యక్తిలా వ్యవహరించేవారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆ పెద్దదిక్కు కరువైపోయింది. తన పరిధిలో మెగాస్టార్ చిరంజీవి కొన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ చేస్తున్నారు. అని అన్ని తన వలన అయ్యే పనులు కావు. ఆయనకు సంబంధం లేకుండా కూడా కొన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

నిర్మాతలు అత్యవసర సమావేశం 


ఇండస్ట్రీలో కార్మికులకు నిర్మాతలకు మధ్య జరుగుతున్న పరిణామాల నిమిత్తం కొన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం అయ్యారు. ఛాంబర్ ప్రెసిడెంట్ తో పాటు సమావేశంలో పాల్గొన్నారు నిర్మాతలు. నిర్మాతల ప్రతిపాదనలో కీలకంగా మారిన కాల్ షీట్స్. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వర్క్ చేయడానికి అభ్యంతరం లేదంటున్న ఫెడరేషన్. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపులో ఫెడరేషన్ మార్పులు చేసింది. ఇప్పుడు 20% మిగతా 10% శాతం ఏడాది చొప్పున పెంచాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనే ప్రస్తుతం నిర్మాతలు చర్చిస్తున్నారు. దీనికి ఒప్పుకొని నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సమ్మె బంద్ అయిపోతుంది. ఒకవేళ నిర్మాతలు దీనికి అంగీకరించకపోతే మళ్లీ పాత పద్ధతే.

మెగాస్టార్ ఎంట్రీ తో సీన్ మారిందా?

ఈ చర్చలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దృష్టికి కూడా వెళ్లాయి. చిరంజీవి ఇంతకు ముందు మాట్లాడుతూ మీరు మీరు తేల్చుకోండి లేకపోతే నేను రంగంలోకి దిగవలసి వస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఇరువైపు సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ తరుణంలో నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్ ల గురించి ఆలోచిస్తుంటే, హీరోలు మాత్రం అప్కమింగ్ ప్రాజెక్టులు గురించి చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి ఒక రెండు మూడు రోజుల్లో ఈ సమస్యలన్నీ క్లియర్ అయి మళ్ళీ షూటింగ్ కి కదిలే పరిస్థితి కనిపిస్తుంది.

Also Read: War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ

Related News

Tamannaah Bhatia: కావాలయ్యా అంటున్న తమన్నా, మేము వస్తాము అంటున్న నెటిజన్స్

Parag Tyagi: చనిపోయిన భార్యకు గుర్తుగా గుండెపై అలాంటి పని చేసిన నటుడు… నిజమైన ప్రేమ అంటూ!

Rashmika: “థమా” ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన రష్మిక… భయపెట్టేస్తోందిగా?

Jr.NTR: వార్ 2 ఫ్లాప్ కు ఎన్టీఆర్ కారణమా? ఓర్నీ ఫ్యాన్స్ కోసం సినిమానే నాశనం చేశారుగా?

Kota Srinivasa Rao: దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు భార్య కన్నుమూత.. నెల రోజుల్లోనే భార్య భర్తలు

Big Stories

×