రోజులో మనం చేసే అతి ముఖ్యమైన భోజనం బ్రేక్ ఫాస్ట్. ఈ అల్పాహారంలో మీరు తీసుకునే ఫుడ్ రోజంతా మీపై ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. రాత్రంతా సుదీర్ఘ ఉపవాసం తర్వాత మీ శరీరం తీసుకునే మొదటి ఆహారం బ్రేక్ ఫాస్ట్. కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో మీరు ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుకున్నట్టేనని వైద్యులు సూచిస్తున్నారు.
పూరి బ్రేక్ ఫాస్ట్
చాలామందికి పూరీ ఆలూ కుర్మా అంటే ఎంతో ఇష్టం. అదిరిపోయే కాంబినేషన్ అల్పాహారంలో వేడి వేడి పూరిని, బంగాళాదుంప కూరతో తింటే ఆ మజాయే వేరు. పిల్లలు, తల్లులు అందరూ ఇలా పూరీని తినేందుకు ఇష్టపడతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. బ్రేక్ ఫాస్ట్ లో పూరీని తినడం ఏమాత్రం మంచిది కాదు. కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచేస్తుంది. ఇంకోటి పూరీ, బంగాళదుంప కూర కాంబినేషన్ మంచి కాదు కూడా.
మసాలా దోశ
భారతదేశంలో ప్రసిద్ధ బ్రేక్ ఫాస్ట్ మసాలా దోశ. అయితే దీనిలో నూనె పరిమాణం అధికంగా ఉంటుంది. నిజానికి మసాలా దోశ ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎప్పుడైతే నూనె అధికంగా వేసి చేస్తారో.. అలాగే బంగాళాదుంప కూరను దీనిపై పెడతారో అది గుండెకు చెడు ఆహారంగా మారిపోతుంది. కాబట్టి మీరు దోశను నూనె తక్కువగా వేసి పైన బంగాళాదుంప కూర లేకుండా తినేందుకు ప్రయత్నించండి. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక.
ఉప్మా
ఉప్మా తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఉప్మాను రవ్వతో తయారుచేస్తారు. రవ్వ పాలిష్ చేసిన పదార్థం. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ జాబితాలోకి వస్తుంది. ఇది ఏ మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. దీనిలో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉండవు. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
టీ బిస్కెట్లు కలయిక కూడా ఏమాత్రం మంచిది కాదు. మన దేశంలో ఎంతో మంది టీ బిస్కెట్లతోనే భోజనం ప్రారంభిస్తారు. ఇది మిమ్మల్ని అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఈ బిస్కెట్లలో చక్కెర, పామాయిల్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజకరమైనవి కాదు.
బ్రెడ్ పై జామ్ రాసుకొని తినేవారు కూడా ఎక్కువే. ఇది చాలా సింపుల్ గా అయిపోయే బ్రేక్ ఫాస్ట్. కానీ మీ ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తుంది. ఎందుకంటే బ్రెడ్ లో చక్కెర ఉంటుంది. దీని శుద్ధి చేసిన పిండితో తయారుచేస్తారు. అలాగే పామాయిల్ కూడా ఉంటుంది. ఈ మూడు మీ ఆరోగ్యానికి ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి.
ఏం తినాలి?
ప్రజలు చెబుతున్న ప్రకారం పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్‌లో కచ్చితంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌లు ఉండాలి. శెనగపిండితో వేసిన దోశ లేదా పెసరపప్పుతో వేసిన దోశ, ఇడ్లీ, వెజిటబుల్ కిచిడి, పనీర్ సాండ్విచ్, వెజిటబుల్ అండ్ ఓట్స్‌తో చేసేవి. కోడిగుడ్లతో చేసే టిఫిన్లు, వెజిటబుల్ పోహా వంటివి అల్పాహారానికి ఉత్తమమైన ఎంపికలు.