Uniboom 24 inch smart TV: ఇంట్లో చిన్న రూమ్స్ లేదా కిచెన్, స్టడీ రూమ్స్ కోసం తక్కువ బడ్జెట్‌లో.. అదిరి పోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చిన Uniboom 60 cm TV మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ టీవీ కేవలం రూ.7,615 ధరకే లభిస్తుంది. లేటెస్ట్ ఫీచర్లు ఎన్నో దీనిలో ఉన్నాయి. ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ టీవీలో 60 సెం.మీ (24 ఇంచుల) హెచ్డీ రెడీ డిస్‌ప్లేను అందించారు. అంతే కాకుండా ఇది 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలోని ప్రత్యేకమైన ‘ఆరా విజన్’టెక్నాలజీ కారణంగా కలర్స్ చాలా షార్ప్‌గా , సహజంగా కనిపిస్తాయి. చిన్న స్క్రీన్ అయినప్పటికీ.. పిక్చర్ క్లారిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. 3 నుంచి 6 అడుగుల దూరంలో కూర్చుని చూడటానికి ఈ సైజ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
ఇది కేవలం సాధారణ టీవీ కాదు, పూర్తి స్థాయి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఇందులో.. గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల 1000 పైగా సర్టి ఫైడ్ యాప్స్, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్‌లైన నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి విభిన్న యాప్స్‌ను నేరుగా డౌన్ లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయెచ్చు. అంతే కాకుండా, ఇందులో ఉన్న ప్రొఫైల్ మోడ్ ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వారి పర్సనల్ వాచ్ హిస్టరీ సేవ్ చేసుకోవచ్చు.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ టీవీలను ఆపరేట్ చేయడం కూడా ఈజీగా మారింది. ఈ యూనిబూమ్ టీవీలో ప్రత్యేకమైన వాయిస్ కంట్రోల్ యాప్ ఫీచర్ ఉంది. రిమోట్ ద్వారా లేదా వాయిస్ కమాండ్ ద్వారా మీకు నచ్చిన ఛానెల్స్ లేదా సినిమాలను ఇన్‌స్టంట్‌గా సర్చ్ చేయెచ్చు. అలాగే మొబైల్ కాస్ట్ ఫీచర్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకొని ఫోటోలు, వీడియోలను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. ఇందులో 500 పైగా మూవీలకు సంబంధించిన కంటెంట్ యాక్సెస్ కూడా లభిస్తుంది.
Also Read: రూ.7,190కే 5 స్టార్ వాషింగ్ మెషీన్..ఫీచర్లు చూస్తే మతిపోతుంది!
చిన్న టీవీ అయినప్పటికీ సౌండ్ విషయంలో ఎలాంటి లోటు లేదు. ఇందులో పవర్ ఫుల్ స్పీకర్లు ఇవ్వడం వల్ల క్రిస్టల్ క్లియర్ ఆడియో ఫీల్ లభిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఎక్స్‌టర్నల్ డివైస్‌లు, సెట్-టాప్ బాక్స్ లేదా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేయడానికి వీలుగా హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు అందుబాటులో ఉన్నాయి. బిల్ట్-ఇన్ వై-ఫై సపోర్ట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ మరింత ఈజీ అవుతుంది.
మార్కెట్లో.. లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ టీవీలతో పోలిస్తే, కేవలం రూ.7,615 ధరకే లభిస్తున్న ఈ మోడల్ నిజంగా ఒక గొప్ప వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. తక్కువ బడ్జెట్‌లో.. అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫీచర్లు, వాయిస్ కంట్రోల్ కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.