Tamil Actor: ప్రతి ఇండస్ట్రీలో నటీనటులు ఒక్కొక్కరుగా మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. స్టార్స్ గా వరుసగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటుగా ఆడియన్స్ మనసుని దోచుకున్న నటులు కొన్ని అనారోగ్య సమస్యలతో లేదా అకాల మరణంతో చనిపోతున్నారు.. తెలుగు ఇండస్ట్రీ తో పాటుగా తమిళ ఇండస్ట్రీలో కూడా వలస మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది యాక్టర్స్ అనారోగ్య సమస్యలతో పోరాడుతూ.. తుది శ్వాస విడిచారు. తాజాగా మరో లెజెండరీ తమిళ యాక్టర్ రోబో రోబో శంకర్ చనిపోయారు. ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. చెన్నైలో షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే చిత్రయూనిట్ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. కానీ ఫలితం లేకుండా పోయింది. శంకర్ మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు..
తమిళప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ ఇకలేరు. ఆయన కామెర్లతో పోరాడుతూ 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మిమిక్రీతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటుడు రోబో శంకర్. అలా బుల్లితెరపై అడుగుపెట్టి ఆ తర్వాత వెండితెరపై స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన అతి చిన్న వయసులో చనిపోవడం పై ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ, లివర్ సమస్యలతో పోరాడుతున్న ఆయన నిన్న షూటింగ్ లొకేషన్ లో కుప్పకూలిపోయాడు.. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ వెంటనే ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపేస్తుంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు..
Also Read:శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి వెరీ స్పెషల్…
శంకర్ సినిమాలోకి రాకముందు బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో మిమిక్రీ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.. అలా తన కామెడీతో కడుపుపై నవ్వించే ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టాడు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరు సరసన నటించి కమిడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అందుకున్నాయి. అజిత్, ధనుష్యులంటే స్టార్ హీరోల సినిమాల్లో ఈయన ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ మధ్య వరుసగా సినిమాలకు సాయం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారా మరణించడం సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు.. ప్రస్తుతం తన స్వగృహంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఆయన సన్నిహితులు పలువురు స్టార్స్ నివాళులు అర్పించారు..