OTT Movie : యూత్ ని ఎంటర్టైన్ చేయడానికే అన్నట్టు కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమాలను చూస్తూ టీనేజర్లు తమని తాము గుర్తు చేసుకుంటారు. అలాంటి ఒక సినిమా హాలీవుడ్ నుంచి వచ్చింది. ఈ అమెరికన్ సినిమా హైస్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఇక్కడ ఇద్దరమ్మాయిలు ఒకరి శత్రువులపై ఒకరు, ప్రతీకారం తీర్చుకోవడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘డూ రివెంజ్’ (Do revenge) 2022లో విడుదలైన అమెరికన్ టీన్ బ్లాక్ కామెడీ చిత్రం. ఇది రాబిన్సన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో కామిలా మెండిస్ (డ్రియా), మాయా హాక్ (ఎలియనోర్), ఆస్టిన్ అబ్రమ్స్ (మాక్స్), రిష్ షా (రస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 58 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2022సెప్టెంబర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
మయామిలోని రోస్‌హిల్ అనే హైస్కూల్‌లో డ్రియా అనే అమ్మాయి ఒక స్టార్ గర్ల్. ఆమె బాయ్‌ఫ్రెండ్ మాక్స్ కి పంపిన ఒక ప్రైవేట్ వీడియో లీక్ అవ్వడంతో ఆమె లైఫ్ తలకిందులవుతుంది. స్కూల్లో అందరూ ఆమెను జడ్జ్ చేస్తారు. ఆమె పాపులారిటీ పోతుంది. ఇదే సమయంలో, ఎలియనోర్ అనే కొత్త అమ్మాయి స్కూల్‌లో జాయిన్ అవుతుంది. ఎలియనోర్‌కి కూడా ఒక సమస్య ఉంటుంది. ఆమె సమ్మర్ క్యాంప్‌లో ఉన్నప్పుడు కారిస్సా అనే అమ్మాయి ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేస్తుంది. ఆ రూమర్ వల్ల ఎలియనోర్ ని అందరూ గే అనుకుంటారు. దీంతో ఆమె లైఫ్ గందరగోళంలో పడుతుంది. ఈ ఇద్దరూ టెన్నిస్ క్యాంప్‌లో కలిసి, నీ శత్రువుని నేను చూసుకుంటా, నా శత్రువుని నీవు చూసుకో అని ఒక డీల్ చేసుకుంటారు. అంటే డ్రియా కారిస్సాపై, ఎలియనోర్ మాక్స్‌పై రివెంజ్ తీసుకోవాలని ప్లాన్.
డ్రియా, ఎలియనోర్‌కి కూల్ మేకోవర్ ఇచ్చి, మాక్స్ గ్యాంగ్‌లో చేర్చుతుంది, అక్కడ ఎలియనోర్ మాక్స్ ఫోన్ హ్యాక్ చేసి, అతని సీక్రెట్స్ బయటపెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ రివెంజ్ ప్లాన్‌లు గందరగోళంగా మారతాయి. ఎలియనోర్ మాక్స్ ఫోన్ నుండి చీటింగ్ టెక్స్ట్‌లను లీక్ చేస్తుంది. కానీ మాక్స్ తనని తాను “పాలియామరస్” అని చెప్పుకుని స్కూల్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడు. దీంతో ఎలియనోర్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. డ్రియా గ్రేడ్స్ పడిపోవడంతో యూనివర్శిటీ నుండి రిజెక్ట్ అవుతుంది. మాక్స్ ఆమె గురించి ఒక ఫేక్ స్టోరీ పబ్లిష్ చేస్తాడు. దీంతో ఆమె మరింత కోపంతో బర్నింగ్ అవుతుంది. ఇక క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు వస్తాయి. డ్రియా, ఎలియనోర్ కలసి రివెంజ్ ప్లాన్ పూర్తి చేస్తారా ? లేక మరిన్ని సమస్యలు తెచ్చుకుంటారా ? అనే విషయాలను, ఈ అమెరికన్ టీన్ బ్లాక్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఊర్లో ఒక్కరిని కూడా వదలని దొర… పెళ్లి కాకుండానే అలాంటి పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు