OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే సైకోపాత్ సినిమాలు ఆడియన్స్ కి చెమటలు పట్టిస్తుంటాయి. ఈ సినిమాలలో ఏదో ఒక కారణం చేత సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ప్రేమ పేరుతొ మోసం చేసే అమ్మాయిలను కిల్లర్ చంపుతుంటాడు. అతని గతం వల్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటాడు. అయితే ఈ సైకో పాత్రలో ప్రభుదేవా నటించడం విశేషం. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బఘీర’ 2023లో విడుదలైన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, రవి కందసామి నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రంలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించగా, శ్రీకాంత్, అమైరా దస్తూర్, రమ్యా నంబీసన్, జనని, గాయత్రీ, సోనియా అగర్వాల్, సంచిత శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. 2 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, 2023 మార్చి 3న థియేటర్లలో విడుదలైంది. 2023 మార్చి 31 నుండి సన్ NXT, ZEE5, Airtel Xstream లలో తమిళం, తెలుగు, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రభు అనే కుర్రాడు, తన చిన్ననాటి స్నేహితుడు మురళితో కలిసి కోయంబత్తూరులో పెరుగుతాడు. వాళ్లిద్దరూ “జంగిల్ బుక్” సీరిస్‌కి పెద్ద ఫ్యాన్స్. ప్రభు తనని తాను బఘీర అని, మురళిని మౌగ్లీ అని పిలుచుకుంటాడు. ప్రభుకి ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంటుంది. కానీ ఆమె తండ్రి ట్రాన్స్‌ఫర్ కారణంగా వేరే ఊరికి వెళ్లిపోతుంది. ఆ తరువాత స్వప్న అనే అమ్మాయి చేతిలో ప్రభు మోసపోతాడు. మరోవైపు మురళిని కూడా అతని భార్య రేష్మా మోసం చేయడంతో, మురళి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ప్రభు మానసికంగా కుంగిపోతాడు. అతను “బఘీర” అనే యాప్ క్రియేట్ చేస్తాడు. దీనిలో మోసం చేసిన అమ్మాయిల ఫొటోలు అప్‌లోడ్ చేస్తే, వాళ్లను టెడ్డీ బేర్ గెటప్ లో ప్రభు చంపేస్తుంటాడు. ఈ క్రమంలో, రమ్యా అనే ఒక సైకాలజీ స్టూడెంట్, బఘీర కేస్ ను స్టడీ చేస్తూ అతనికి టార్గెట్ అవుతుంది.
రమ్యాను శ్రీలంకలోని ఒక విల్లాలో బంధిస్తాడు. అక్కడ అతను చంపిన అమ్మాయిలను స్టాచ్యూలుగా మార్చి ఉంచుతాడు. ఇన్స్‌పెక్టర్ సాయి కుమార్ ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తూ, ఒక బ్లైండ్ మ్యాన్ ద్వారా బఘీర డైరీని కనుగొంటాడు. ఇందులో అతని సైకోపాతిక్ బిహేవియర్‌కు కారణాలు బయటపడతాయి. క్లైమాక్స్‌లో రమ్యా బఘీరతో ఫేస్-ఆఫ్‌లో ఉంటుంది. రమ్యా తన సైకాలజీ నాలెడ్జ్‌తో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కథ ఒక ఎమోషనల్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ప్రభు నుంచి రమ్యా తప్పించుకుంటుందా ? ప్రభుని పోలీసులు పెట్టుకుంటారా ? ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : పిల్లల్ని చంపి అమరుడయ్యే విలన్… పాప ఎంట్రీతో ఒక్కొక్కడికీ దబిడి దిబిడే… ఈ సైకలాజికల్ హారర్ మూవీ అదుర్స్