E-Paper
Advertisement

Tharun Bhascker : ఆ మూవీకి సీక్వెల్ నాకిష్టం లేదు.. కానీ చేయాల్సి వస్తుంది

Tharun Bhascker : ఆ మూవీకి సీక్వెల్ నాకిష్టం లేదు.. కానీ చేయాల్సి వస్తుంది
Advertisement

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ టాలీవుడ్ దర్శకుడిగా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)వంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేయడంతో అప్పుడు కూడా మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు.

ప్రేక్షకుల కోసమే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్..

ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirastu) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో విక్రాంత్ (Vikranth)తో కలిసి తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించి ప్రస్తావనకు వచ్చింది. నిజానికి ఈ సినిమా సీక్వెల్ చేయాలనుకోలదట కానీ, అభిమానులకు, ప్రేక్షకులకు ఈ నగరానికి ఏమైంది సినిమా బాగా నచ్చటం వల్లే నేను కూడా ప్రేక్షకుల కోసమే ఈ సినిమా సీక్వెల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ నగరానికి ఏమైంది 2..

Advertisement

ఏ సినిమా కైనా సరైన సమయం రావాలి. ఈ నగరానికి ఏమైంది 2 సినిమాకు ఇప్పుడు సమయం వచ్చిందని అలాగే టేబుల్ పై డబ్బులు కూడా రెడీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా సీక్వెల్ తెరపైకి రాబోతుందని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇప్పటికే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించి అధికారక పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి వంటి తదితరులు సీక్వెల్లో కూడా సందడి చేయబోతున్నారు.

నిర్మాతగా తప్పుకున్న సురేష్ బాబు?

Advertisement

ఇక ఈ సీక్వెల్ సినిమాకు ఎస్ వర్జినల్ బ్యానర్ పై సృజన్, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారని వెల్లడించారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా నిర్మాణ విషయంలో దగ్గుబాటి సురేష్ బాబు వెనుకడుగు వేస్తున్నారని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Also Read: Lokah 2: లోక సీక్వెల్లో మెగాస్టార్.. భారీగా ప్లాన్ చేసిన దుల్కర్ !

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×