BigTV English

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Pushpa Song AGT -2025 : ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ‘అమెరికాస్ గాట్ టాలెంట్ షో’ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలెంట్ ఉన్న ఎంతోమంది తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ షోను వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ షోలో తమ పర్ఫామెన్స్ తో అటు జడ్జిలను ఇటు ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ టాలెంట్ షోలో ఇండియా నుంచి వెళ్లిన ఒక బృందం పుష్ప పాటకు ఇచ్చిన పర్ఫామెన్స్ కి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటు చిత్ర బృందం కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆ బృందం ప్రదర్శించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయారు. పైగా అల్లు అర్జున్ అభిమానులు పుష్ప సాంగ్ ని తెగ ప్రమోట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ అని తెలిసి అందరూ నివ్వెరపోతున్నారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ పరువు తీశారు కదా అంటూ నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


అమెరికన్స్ గాడ్ టాలెంట్ షో పుష్ప పాటకు అదిరిపోయే ప్రదర్శన..

అసలు విషయంలోకి వెళ్తే.. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షో లో “బీ యూనిక్ క్ర్యూ” అనే ఒక ఇండియా బృందం పుష్ప(Pushap ) మూవీ “దాక్కో దాక్కో మేక” పాట మ్యూజిక్ కి తమదైన శైలిలో ప్రదర్శన ఇచ్చి జడ్జిలనే కాదు ఆడిటోరియంలో షో చూస్తున్న ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని పుష్ప టీం తో పాటు అల్లు అర్జున్ కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కొంతమంది ఇది ఫేక్ అని, ఎడిట్ చేసి వైరల్ చేశారు అంటూ అసలు నిజం బయటపెట్టారు.


ఫేక్ వీడియో అంటూ అసలు నిజం బయటకి..

అలా ప్రస్తుతం ఈ వీడియో ఎడిటెడ్ వీడియో అని తేలిపోయింది. అసలు ఆ వీడియోలో ఉన్నది పుష్ప ట్రాక్ కాదు.. ఇమాజిన్ డ్రాగన్స్ బిలీవర్ ట్రాక్ . ఈ ట్రాక్ కి బీ యూనిక్ క్యూ గ్రూపు డాన్స్ వేసింది. కానీ ఎడిటెడ్ వీడియోలో పుష్ప ట్రాక్ తో ఉండగా ఇది కాస్త వైరల్ అయింది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. పుష్ప టీం తో పాటు అల్లు అర్జున్ కూడా ఇది నిజమని నమ్మారు. చివరికి ఇది ఎడిట్ చేసిన వీడియో అని తెలియడంతో నెటిజన్లు కూడా నోరెళ్ళ బెడుతున్నారు. “ఎంత పని చేశార్రా” అని కొంతమంది మీమ్స్ క్రియేట్ చేస్తుంటే.. “బన్నీ పరువు కూడా పాయే” అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే “ఇలాంటి వీడియోలు అటు స్టార్ సెలబ్రిటీలను కూడా బోల్తా కొట్టించాయని.. మీ ఎడిటింగ్ కి హ్యాట్సాఫ్” అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు..

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar ) దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసి అటు బాలీవుడ్ లో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమా తర్వాత పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే పుష్ప సినిమాకి దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) అందించిన మ్యూజిక్ ఒక రేంజ్ లో సినిమాను టాప్ కి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

 

also read:Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

Related News

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×