BigTV English

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

Madhupriya:శ్రావణమాసం రావడంతో సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీనికి తోడు పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఫోక్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న మధుప్రియ (Madhupriya) ఇంట కూడా పెళ్లి హంగామా మొదలైంది. ప్రస్తుతం హల్దీ వేడుకలలో డాన్సులు చేస్తూ జోరు పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది మధుప్రియ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.


మధుప్రియ ఇంట మొదలైన పెళ్లి వేడుకలు..

ఇటీవలే తన చెల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించిన మధుప్రియ.. ఇప్పుడు తన చెల్లి పెళ్లి వేడుకలను దగ్గరుండి మరీ నిర్వహిస్తోంది. ఆగస్టు 5న ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా పూర్తయింది. ఈ వేడుకలో తన చెల్లితో కలిసి తీన్మార్ స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది మధుప్రియ. ఈ సందర్భంలో తీసిన వీడియోలు, ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “మా చెల్లి పెళ్లికూతురు అయ్యింది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మధుప్రియ చెల్లికి ముందుగానే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.


మధుప్రియ కెరియర్..

ఒక మధుప్రియ కెరియర్ విషయానికి వస్తే.. ఫోక్ సాంగ్ లకు పెద్దపీట వేసిన ఈమె.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందింది. చిన్నతనంలోనే “ఆడపిల్లనమ్మా” అనే పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించి , ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది మధుప్రియ..అప్పుడు ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు కావడం గమనార్హం. అలా పదేళ్ల వయసులోనే ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ తో ఆకర్షించిన ఈమె.. 2011లో ‘దగ్గరగా దూరంగా’ అనే సినిమాలో “పెద్దపులి” పాటతో సినీ రంగ ప్రవేశం చేసింది. తన గొంతులో ఏదో మ్యాజిక్ ఉందని ప్రతిసారి నిరూపిస్తూ క్రేజ్ దక్కించుకుంది మధుప్రియ

మధుప్రియ సినిమాలు..

మధుప్రియ ఫిదా, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సాక్ష్యం, టచ్ చేసి చూడు, లైలా, సంక్రాంతికి వస్తున్నాం ఇలా పలు సినిమాలలో పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మధుప్రియ వ్యక్తిగత జీవితం..

18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి జీవితం గడుపుతున్న మధుప్రియ.. ఇప్పుడు చెల్లి పెళ్లి వేడుకలో తెగ హంగామా చేస్తోంది. హెల్దీ రోజే ఈ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చింది అంటే ఇక పెళ్లి వేడుకల్లో ఇంకెలా జోష్ కనబరుస్తుందో చూడాలి.

ది బిగ్ ఫోక్ నైట్ – 2025 లో సందడి చేయబోతున్న మధుప్రియ..

అంతేకాదు ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహించబోతున్న “ది బిగ్ ఫోక్ నైట్ – 2025” కార్యక్రమంలో కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 23న జరగబోయే ఈ కార్యక్రమనికి మధుప్రియ తన గొంతును మరొకసారి వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ఈమె కోసమే చాలామంది టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా లేకపోలేదు అని సమాచారం. లైవ్ పెర్ఫార్మెన్స్ తో అలరించడానికి సిద్ధమవుతున్న మధుప్రియ అక్కడ తన పెర్ఫార్మన్స్ తో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి..

ALSO READ:India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×