E-Paper
Advertisement

సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?

సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?
Advertisement

Bengaluru-Goa Vande Bharat: బెంగళూరు నుంచి గోవాకు ప్రయాణించే వారికి కొత్త వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలులో ప్రయాణించిన ప్యాసింజర్లు తమ ఎక్స్ పీరియెన్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలకు ఈ రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉందని ప్రశంసిస్తున్నారు. రైలులోని సౌకర్యాలు, ప్రయాణ వాతావరణం, ఫుడ్ తమకు నచ్చాయని ప్రయాణికులు చెబుతున్నారు.

వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉందంటూ ప్రశంసలు

రైల్వేశాఖ తన అధికారిక ‘X’ అకౌంట్ లో ఈ రైలులో ప్రయాణించిన వారి ఎక్స్ పీరియెన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రయాణికుల చిరునవ్వులే వారి సంతోషాన్ని వెల్లడిస్తున్నాయి. ఓ ప్రయాణికుడు వందే భారత్‌లో ప్రయాణించడం అద్భుతంగా ఉందని చెప్పాడు. మరొకరు ఈ రైలు కోసం కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు ఇతర రైళ్లతో పోలిస్తే ఇందులో ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుందని ఓ సీనియర్ సిటిజన్ అభిప్రాయపడ్డారు. మహిళలు, గర్భిణులు, వృద్ధులు సైతం ఈ రైలులో సులభంగా ప్రయాణించవచ్చని మరో ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కొత్త రైలు అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లల సందడితో సాగిన ప్రయాణం

Advertisement

ఈ రైలులో స్కూల్ విద్యార్థులు కూడా ప్రయాణించారు. ఓ విద్యార్థి జానపద గీతం పాడగా, మరో విద్యార్థి వీర యోధుడు సంగొల్లి రాయన్న పాత్రను ప్రదర్శించాడు. బెంగళూరు నుంచి మడ్గావ్ వరకు సాగిన ప్రయాణాన్ని పిల్లలు ఎంతో ఆస్వాదించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రైలులో అందించిన ఫుడ్, ప్రయాణ వాతావరణం కూడా బాగున్నాయని ప్రయాణికులు ప్రశంసించారు.

పశ్చిమ కనుమల అందాల మధ్య ప్రయాణం

బెంగళూరులోని యశ్వంత్‌ పూర్ నుంచి గోవాలోని మడ్గావ్ వరకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. ఈ మార్గంలో పశ్చిమ కనుమల ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సకలేశ్‌ పుర-సుబ్రహ్మణ్య రోడ్డు ఘాట్ సెక్షన్‌ లో సొరంగాలు, పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. యశ్వంత్‌పూర్, మడ్గావ్ మధ్య ఈ రైలు మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది.

టైమింగ్స్, ప్రయాణ వివరాల గురించి..

Advertisement

ఈ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ నవంబర్ 15 నుంచి సాధారణ సేవలను ప్రారంభించింది. నవంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే సమయం ఉదయం 7:35 గంటలు, మడ్గావ్ చేరుకునే సమయం రాత్రి 8:55 గంటలు, ప్రయాణ సమయం 13 గంటల 20 నిమిషాలు. తిరుగు ప్రయాణంలో మడ్గావ్ నుంచి ఉదయం 8:20 గంటలకు బయలుదేరి, రాత్రి 9:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి సుమారు 12 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది.

Read Also: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 96 ప్రత్యేక రైళ్లు!

Tags

Related News

వీసా లేకుండానే ఐర్లాండ్ ట్రిప్.. భారతీయులకు బంపర్ ఆఫర్!

6:45 PM అని కాకుండా 18:45 అని ఎందుకు రాస్తారు? రైల్వే, ఎయిర్‌లైన్స్ టైమింగ్స్ ఎందుకిలా ఉంటాయి?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 96 ప్రత్యేక రైళ్లు!

ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి షాక్.. అప్పుడే నిండిపోయిన రైళ్లు!

చలికాలంలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? మంచు కొండల మధ్య ఈ 5 ప్రాంతాలు సూపర్

Pamban Bridge Tragedy: రన్నింగ్ రైల్లో నుంచి సముద్రంలోకి జంప్.. యువకుడు బలి, యువతి పరిస్థితి..

Big Stories

Advertisement
×