BigTV English

Jr.NTR: వార్ 2 ఫ్లాప్ కు ఎన్టీఆర్ కారణమా? ఓర్నీ ఫ్యాన్స్ కోసం సినిమానే నాశనం చేశారుగా?

Jr.NTR: వార్ 2 ఫ్లాప్ కు ఎన్టీఆర్ కారణమా? ఓర్నీ ఫ్యాన్స్ కోసం సినిమానే నాశనం చేశారుగా?

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ (NTR)ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయటమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలను చేరుకోవడంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి.


ఎన్టీఆర్ పాత్ర చనిపోవాలా?

ఇలా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఎన్టీఆర్ బాలీవుడ్  డెబ్యూ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయిందని చెప్పాలి. అయితే తాజగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ 2 సినిమా కథ అది కాదని, అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా కథలో ఎన్టీఆర్ పాత్ర చనిపోయే విధంగా డైరెక్టర్ అయాన్ ప్లాన్ చేసినట్టు సమాచారం.


అభిమానుల కోసం సినిమాని చంపేస్తారా?

ఈ కథ విన్న తర్వాత ఎన్టీఆర్ నిర్మాత ఆదిత్య చోప్రాను(Aditya Chopra) ఈ కథ విషయంలో కాస్త కన్విన్స్ చేశారని తెలుస్తోంది. ఇలా తన పాత్రను కనుక సినిమాల్లో చంపేస్తే తెలుగు ప్రేక్షకులు దానిని యాక్సెప్ట్ చేయలేరని, అలా చేయటం వల్ల అనుకున్నంత రీచ్ ఉండదంటూ నిర్మాతను కన్విస్ చేయడంతోనే వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది. ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు ఈ విషయంపై స్పందిస్తూ.. వార్ 2 సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్టీఆర్ ఇలా కారణమయ్యారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం చనిపోవాల్సిన తారక్ పాత్రను బ్రతికిస్తూ సినిమానే నాశనం చేసేసారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దేవర 2 క్యాన్సిల్ అయినట్టేనా?

ప్రస్తుతం వార్ 2 సినిమాకి సంబంధించిన ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కని నేపథ్యంలో అభిమానులు ఈ విషయం తెలిసి విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా చేయాల్సి ఉండగా అది కాస్త క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ ఆసక్తి చూపించని నేపథ్యంలో కొరటాల శివ అదే కథతో మరొక హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Also Read: Anupama parameswaran: త్రివిక్రమ్ ఎవరో నాకు తెలియదు..ఇంత మాట అనేసిందేంటి భయ్యా?

Related News

Rashmika: “థమా” ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన రష్మిక… భయపెట్టేస్తోందిగా?

Telugu film producers : తగ్గుతున్న నిర్మాతలు… ఈ డిమాండ్స్‌కు గ్రీన్ సిగ్నల్… ఇక సమ్మె బంద్ ?

Kota Srinivasa Rao: దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు భార్య కన్నుమూత.. నెల రోజుల్లోనే భార్య భర్తలు

Anupama parameswaran: త్రివిక్రమ్ ఎవరో నాకు తెలియదు..ఇంత మాట అనేసిందేంటి భయ్యా?

V.N.Adithya: సినీ సమ్మెపై డైరెక్టర్ హెచ్చరిక.. మాట వినకపోతే అడుక్కు తింటారంటూ!

Big Stories

×