Weather News: ఈ నెల మొదటి వారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇక ఏపీలో గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో వానలు ఏకధాటిగా కురుస్తున్నాయి. అయితే.. వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు (ఆగస్టు 19న) దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి రేపు భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చారు.
మూడు రోజుల్లో ఇది వాతావరణ పరిస్థితి
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వానలు కురుస్తాయని తెలిపింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడా వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పిడుగులు కూడా అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో వర్షం దంచుడే దంచుడు..
ఈ రోజు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో రాబోయే 12 గంటల్లో భారీ వానలు పడతాయని వివరించారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
ఈ తేదీల్లో వర్షాలు బంద్..
హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించారు. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడిన వానలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో ఈ నెల 21 వరకు సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఆగస్టు 22, 23, 24 తేదీల్లో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. ఈ రోజుల్లో పెద్దగా వర్షాలు పడే ఛాన్స్ లేదని పేర్కొన్నారు. ఆగస్టు 25 తర్వాత బంగాళ ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. మళ్లీ భారీ వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
ALSO READ: Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..
ఏపీలో ఈ జిల్లాల్లో కొట్టుడే కొట్టుడు..
ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ALSO READ: Indian Air Force: భారత వాయుసేనలో నాన్- కంబాటెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.30వేలు