E-Paper
Advertisement

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు
Advertisement

Medchal Collector: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని వెంటనే కోర్టు ఎదుట హాజరుపరచాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కోర్టు విచారణకు గైర్హాజరు.. తీవ్ర అసహనం

Advertisement

ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం కలెక్టర్ మనూ చౌదరి నేరుగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను, విచారణ ప్రక్రియను బాధ్యతాయుతమైన అధికారులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కలెక్టర్‌ను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల మరో కలెక్టర్‌కు జైలు శిక్ష

Advertisement

కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం వహించిన కేసులో ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ విషయంలోనూ హైకోర్టు కఠినంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు న్యాయస్థానాల ఆదేశాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని తాజా పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది.

Also Read: ఢిల్లీలో రాహుల్‌తో షర్మిల భేటీ.. పెళ్లి పిలుపు మాత్రమేనా, వెనుక పెద్ద వ్యూహమే ఉందా?

Tags

Related News

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

తెలంగాణ గల్లీ కారు.. ఢిల్లీకి చేరగానే కమలం రూపురేఖలు-సీఎం రేవంత్‌రెడ్డి

Big Stories

Advertisement
×