E-Paper
Advertisement

ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్

ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్
Advertisement

Fantasy Adventure on OTT: మన ఇండియాలో చిన్న పిల్లలకు ఇష్టమైన యానిమేటెడ్ హీరోల్లో ‘ఛోటా భీమ్’ పేరు ఎప్పుడూ ముందుంటుంది. లడ్డూలు తింటూ తన అపారమైన బలంతో ధోళక్‌పూర్‌ను కాపాడే భీమ్ సాహసాలకు పిల్లలతో పాటు పెద్దలు కూడా అభిమానులే. ఇప్పుడు భీమ్ మరో భారీ సాహసంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘Chhota Bheem – Kirmada & Bhakshak Special’ పేరుతో రూపొందిన ఈ 12 ఎపిసోడ్ల యానిమేషన్ స్పెషల్ ఓటీటీలోకి వచ్చేసింది. కిర్మాడ, భక్షక్ వంటి భయంకరమైన విలన్లతో భీమ్ చేసే పోరాటం, మాయా ప్రపంచాల్లో జరిగే సాహసాలు ఈ సిరీస్‌లో హైలెట్ గా నిలుస్తాయి. మరి ఈసారి భీమ్ ఎదుర్కొనే ప్రమాదాలేంటి? వాటి నుంచి ధోళక్‌పూర్‌ను ఎలా కాపాడతాడు? ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అధోలోకంలో బంధించబడి ఉన్న మహాశైతాన్ తన జైలు నుంచి బయటపడేందుకు ఒక పెద్ద పథకం వేస్తాడు. అందుకోసం మూడు శక్తివంతమైన మాయా వస్తువులను సేకరించాల్సి ఉంటుంది. ఈ పనిని పూర్తి చేయడానికి క్రూరమైన రాక్షస రాజు కిర్మాడతో పాటు జుహును భూమిపైకి పంపిస్తాడు. వాళ్లు తమ లక్ష్యం కోసం బయలుదేరడంతో భీమ్‌కు కొత్త సవాలు ఎదురవుతుంది. ధోళక్‌పూర్‌తో పాటు ప్రపంచాన్ని కాపాడేందుకు భీమ్ తన స్నేహితులు చుట్కీ, రాజు, జగ్గు, కాలియాతో కలిసి రంగంలోకి దిగుతాడు.

Advertisement

ఈ క్రమంలో భీమ్ ప్రయాణం సాధారణ పోరాటాలకు పరిమితం కాదు. హృదయ లోక్, యిన్-యాంగ్ లోక్ వంటి వింత మాయా ప్రపంచాల్లోకి వెళ్లి అక్కడి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు కిర్మాడ తన శక్తిని పెంచుకుంటూ భీమ్‌కు మరింత పెద్ద సవాలుగా మారతాడు. కథ ముందుకు సాగేకొద్దీ కిర్మాడకు సంబంధించిన మల్టీవర్స్ రహస్యాలు కూడా బయటపడతాయి. ఇతర ప్రపంచాలకు చెందిన భీమ్ రూపాలతో కలిసి పోరాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

ఇక భక్షక్ రంగంలోకి దిగిన తర్వాత సాహసం మరో స్థాయికి చేరుతుంది. గ్రహాలనే మింగేయగల భయంకరమైన శక్తి ఉన్న భక్షక్‌ను అడ్డుకోవడానికి భీమ్ త్రిమూర్తి రత్నం కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఎదురయ్యే రాక్షసులు, మాయా అస్త్రాలు, భారీ యాక్షన్ పోరాటాలు చిన్నారులకు మంచి వినోదాన్ని అందిస్తాయి. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ప్రపంచం, కొత్త ప్రమాదం, భీమ్ చేసే సాహసాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా టీమ్‌వర్క్, ధైర్యం, స్నేహం వంటి అంశాలను కూడా ఇందులో చూపించారు. పిల్లలకు ఫాంటసీ అడ్వెంచర్లు, సూపర్ హీరో యాక్షన్ అంటే ఇష్టమైతే ఈ భీమ్ స్పెషల్‌ను ఓసారి చూడొచ్చు.

ఓటీటీ వివరాలు

Advertisement

‘Chhota Bheem – Kirmada & Bhakshak Special’ యానిమేషన్ సిరీస్ 2026 నవంబర్ 12న విడుదలైంది. మొత్తం 12 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్ ఇంగ్లీష్ ఆడియోతో Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇంగ్లీష్ ఆడియోతో పాటు కలర్‌ఫుల్ హై-డెఫినిషన్ యానిమేషన్ విజువల్స్ తో ఈ సిరీస్ చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read Also: రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్

Tags

Related News

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చేసిందోచ్… ఓటీటీలో తలైవా మాస్ జాతర షురూ

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

Big Stories

Advertisement
×