E-Paper
Advertisement

టీమిండియా కొంప‌ముంచిన అంపైర్లు…న‌ఖ్వీ డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ!

టీమిండియా కొంప‌ముంచిన అంపైర్లు…న‌ఖ్వీ డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ!
Advertisement

Umpire Controversy In Sri Lanka vs India: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Rising Stars Asia Cup 2026 Tournament) నేపథ్యంలో గురువారం టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka A vs India A, 1st Semi-Final (A1 v B2)) మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో తప్పక గెలవాల్సిన టీమిండియా జూనియ‌ర్స్ జ‌ట్టు చేతులెత్తేసింది. అద్భుతంగా రాణించిన శ్రీలంక ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకొని.. ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి అంపైర్లే కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

టీమిండియా కొంప‌ముంచిన అంపైర్లు…న‌ఖ్వీ ఇచ్చిన డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా మొక్సిన్ న‌ఖ్వీ ఉన్న తరుణంలో టీమిండియా జట్టుకు వ్యతిరేకంగా అంపైర్లు వ్యవహరించారని మండిపడుతున్నారు. లంక‌తో జ‌రిగిన సెమీస్ లో టీమిండియా ఓడిపోయేలా అంపైర్లు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని, డీఆర్ఎస్ లేక‌పోవ‌డం న‌ఖ్వీకి అడ్వాంటేజ్ గా మారింద‌ని ఫైర్ అవుతున్నారు. ఫైనల్ కు టీమిండియా వస్తే టైటిల్ దక్కించుకుంటుందనే భయంతో అంపైర్ల‌ను మొహ్సిన్ న‌ఖ్వీ ముందే కొనుగోలు చేసినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. మొహ్సిన్ న‌ఖ్వీ కుట్రలు చేయకపోయి ఉంటే కచ్చితంగా టీమిండియా గెలిచి ఫైనల్ కు వెళ్లేదని పేర్కొంటున్నారు.

రింకూ సింగ్ LBWపై రాజుకున్న వివాదం

Advertisement

టీమిండియా బ్యాటింగ్ సమయంలో రవిందు ఫెర్నాండో బౌలింగ్ లో రింకు సింగ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. బంతి ప్యాడ్ల‌కు తగలగానే శ్రీలంక ప్లేయర్లు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో వెంటనే అంపైర్ ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఔట్ ఇచ్చేశాడు. దీంతో వెంటనే రింకు సింగ్ సీరియస్ అయ్యాడు. మొదట బ్యాట్ కు తగిలి ఆ తర్వాత ప్యాడ్ల‌కు తగిలిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా డీఆర్ఎస్ సిస్టం లేకపోవడంతో రింకు సింగ్ పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అంపైర్ తీసుకున్న నిర్ణయంతో రింకు సింగ్ బలయ్యాడని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Advertisement

అటు టీమిండియా బౌలింగ్ చేసే క్రమంలో కూడా అంపైర్లు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. మొదట హర్ష్ దూబే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయినప్పటికీ అంపైర్ ఇవ్వలేదని వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే 24వ‌ ఓవర్ షాబాద్ అహ్మద్ వేశాడు. ఆ సమయంలో లంక ఓపెనర్ లసిత్ క్రూస్‌పుల్లే ప్యాడ్లకు బంతి తగిలింది. క్లియర్ గా అది ఔట్ అని భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీలు చేశారు. కానీ బంతి బ్యాట్ కు ముందు తగిలిందని.. ఆ తర్వాత పాడ్లకు తగిలినట్టు అంపైర్ నాటౌట్ గా ప్రకటించేసాడు. ఈ నిర్ణయం నేపథ్యంలో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ అటు బౌలర్ షాబాద్ అహ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అంపైర్ తీసుకున్న‌ మూడు నిర్ణయాలు టీమిండియాకు విజయాన్ని దూరం చేశాయని చర్చ నడుస్తోంది.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

 

 

 

Related News

క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌న్నీళ్ల‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ క‌వ‌ర్ చేస్తున్నాడు..!

గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా బూతు పురాణం.. బ్యాన్ వేయాలంటూ డిమాండ్లు

శ్రీలంకపై వైభవ్ సెంచరీ చేసుంటే ట్రోలింగ్ ఆపేవాళ్లం, కానీ ఇప్పుడు రెచ్చిపోతాం

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

పాకిస్తాన్ మీడియాను బాయ్ కాట్ చేసిన‌ బాబ‌ర్ ఆజం.. దేశ‌ద్రోహి అంటూ రివ‌ర్స్ ఎటాక్

వైభ‌వ్ నాకు కొడుకు లాంటోడు…200 బాదాక‌ యువ‌రాజ్ పేరు చెప్పి కొంప‌ముంచాడు

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు

Big Stories

Advertisement
×