OTT Movie : హాలీవుడ్ సినిమాలలో సైకోలు చేసే ఆరాచకాలు భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాలను చస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమాలో, వెకేషన్ కి వచ్చిన కొంతమంది స్నేహితులు ఈ సైకోల చేతికి చిక్కుతారు. ఆ తరువాత స్టోరీ అరచకంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ స్లాషర్ హారర్ మూవీ పేరు Wrong Turn 5: Bloodlines’ 2012 లో వచ్చిన ఈ సినిమాక్ డెక్లాన్ ఓ’బ్రియన్ దర్శకత్వం వహించారు. ఇది “Wrong Turn” ఫిల్మ్ సిరీస్‌లో ఐదవ భాగం. ఈ సినిమా 2003 లో వచ్చిన “Wrong Turn”కి ప్రీక్వెల్‌గా వచ్చింది. ఇందులో డగ్ బ్రాడ్లీ (మేనార్డ్), కామిల్లా ఆర్ఫ్వెడ్సన్ (షెరీఫ్ ఆంజెలా), సైమన్ గింటీ (బిల్లీ), రోక్సాన్ మెకీ (లిటా), పాల్ లూబ్కే (గస్) నటించారు. ఈ స్టోరీ వెస్ట్ వర్జీనియాలోని ఒక చిన్న పట్టణంలో జరిగే హాలోవీన్ ఫెస్టివల్ నేపథ్యంలో జరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
వర్జీనియాలోని ఫెయిర్‌లేక్ అనే చిన్న పట్టణంలో, హాలోవీన్ సందర్భంగా “మౌంటైన్ మ్యాన్ మ్యూజిక్ ఫెస్టివల్” జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఐదుగురు కాలేజీ స్నేహితులు బిల్లీ , అతని స్నేహితురాలు క్రజ్, లిటా, ఆమె ప్రియుడు గస్ , జూలియన్ వస్తారు. సిరీస్‌లోని ప్రధాన విలన్లైన హిల్లికర్ సోదరులు, మేనార్డ్ అనే కిల్లర్ ఒక హత్యాకాండను ప్రారంభిస్తారు. మొదట ఒక వార్తా రిపోర్టర్ కలీన్ వెబర్ ను హిల్లికర్ సోదరులు, మేనార్డ్ లు కలసి హత్య చేస్తారు. ఆతరువాత ఈ ఫెస్టివల్‌కు స్నేహితులు బృందం వెళుతుండగా, వీళ్ళ కారు రోడ్డు మధ్యలో నిలబడిన మేనార్డ్‌ను ఢీకొని ప్రమాదానికి గురవుతుంది. మేనార్డ్ వారిపై దాడి చేస్తాడు, కానీ బిల్లీ, గస్, జూలియన్ అతని నుంచి తప్పించుకుంటారు. షెరీఫ్ ఆంజెలా కార్టర్ అనే పోలీస్ వచ్చి మేనార్డ్‌ను అరెస్ట్ చేసి, స్నేహితులను కూడా కస్టడీలోకి తీసుకుంటుంది.
అయితే, మేనార్డ్‌ను జైలు నుండి విడిపించేందుకు హిల్లికర్ సోదరులు స్టేషన్ పై దాడి చేస్తారు. షెరీఫ్ ఆంజెలా బిల్లీ, జూలియన్, ఒక ఖైదీ అయిన మోస్ లను డిప్యూటీలుగా నియమించి, వాళ్ళకు షాట్‌గన్‌లు ఇచ్చి స్టేషన్‌ను కాపాడమని చెబుతుంది. ఆమె రేడియో ద్వారా బ్యాకప్ కోసం సహాయం కోరుతుంది. కానీ రేడియో జాకీ టెడ్డీ దానిని జోక్‌గా భావించి పట్టించుకోదు. బిల్లీ, జూలియన్ క్రజ్‌ను వెతకడానికి బయటకు వెళతాడు. కానీ ఆమె ఇప్పటికే హిల్లికర్ సోదరుల చేత చంపబడుతుంది. ఇలా ఒక్కొక్కరూ ఈ సైకోల చేత దారుణంగా చంపబడుతుంటారు. చివరికి అక్కడ ఎవరైనా ప్రాణాలతో బయట పడతారా ? ఈ సైకోలను పోలీసులు పట్టుకుంటారా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే.
Read Also :చెరువులో మృతదేహం… ఐఎండీబీలో 8.1 రేటింగ్… సడన్ గా ఓటీటీలోకి గ్రిప్పింగ్ మర్డర్ మిస్టర