Tollywood : ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాలకు చిక్కులు ఎదురయ్యాయి.. ప్రభాస్ నటించిన రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు పర్మిషన్ కోసం తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు.. సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న హైకోర్టుని ఆశ్రయించిన ఈ సినిమాల నిర్మాతల ఫిటిషన్ ను నేడు విచారణ జరపనున్నారు.. అసలు ఇవాళ విచారణలో సినిమాలకు అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో ఒకసారి తెలుసుకుందాం..
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతికి బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.. స్వీట్ తీసుకోండి ఇందులో ముఖ్యంగా జనవరి 9న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్, జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కాబోతుంది.. సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిని కోరుతూ ఫిటిషన్ ను చిత్ర నిర్మాతలు వేశారు.. టికెట్ ధరలు పెంచేందుకు హైకోర్టు నిరాకరించారు.. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసారు. దీనిపై నేడు విచారణ జరుపనున్నారు. హైకోర్టులో జరిగే విచారణపై చిత్ర నిర్మాతలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.. టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.. తీర్పు అనుకూలంగా రాకుండా ఉంటే ఈ సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..
Also Read :అవనికి ఘోర అవమానం.. అమ్మవారిలాగ మారిన అవని.. పల్లవి దొరికిపోతుందా..?
టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈమధ్య వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నాడు.. ఇప్పుడు రాబోతున్న రాజా సాబ్ మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు హీరోయిన్గా నటిస్తున్నారు.. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. అలాగే చిరంజీవి, టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు రాబోతుంది.. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించింది. ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులోనూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. ఈ మూడు సినిమాలు కేవలం మూడు రోజుల తేడాతో థియేటర్లోకి రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి..