Coolie : కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తున్న ఏకైక సినిమా కూలీ. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇందుకు కారణం ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్.
నగరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ వరుస హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సాధించుకున్నాడు. కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు చాలామందికి అభిమాన దర్శకుడు అయిపోయాడు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో లోకేష్ కి సెపరేట్ గా కొన్ని ఎలివేషన్ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి.
సినిమాలో హైలెట్ అదే
కూలీ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చాలామంది ఇది సినీమాటిక్ యూనివర్స్ లో భాగం అని పోస్టులు మొదలు పెడుతున్నారు. ఇంకొంతమంది కేవలం రజినీకాంత్ తో చేసిన సపరేట్ సినిమా అంటున్నారు. మరి కొంతమంది సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు అని అనుకుంటున్నారు. సినిమా ఇంట్రడక్షన్ అదిరిపోద్ది అని మరి కొంతమంది అభిప్రాయం. మొత్తానికి ఈ సినిమా ఇంట్రడక్షన్ కాదు, క్లైమాక్స్ కాదు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోతుంది అని లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రేక్షకులు దీన్ని ఎప్పుడు చూస్తారా అని ఆసక్తి తనకి కూడా ఉన్నట్లు తెలిపాడు.
పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి
కొన్ని సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ డేట్ విషయంలో చాలాసార్లు మార్పులు జరుగుతూ ఉంటాయి. అతి తక్కువ మంది మాత్రమే ఒక సినిమా కోసం డెడికేటెడ్ గా పనిచేసిన దర్శకులు ప్రస్తుత కాలంలో ఉన్నారు. అలాంటి దర్శకుల ప్రస్తావన వస్తే కచ్చితంగా వినిపించే పేరు లోకేష్. ఇప్పటివరకు తాను చేసిన ఐదు సినిమాలను కూడా సకాలంలో పూర్తి చేశాడు. అలానే తన ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు తన షూటింగ్లో రెండు కెమెరాలు ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఒక రోజు 13 కెమెరాలు పెట్టి పని చేసిన రోజులు కూడా ఉన్నాయి అని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు లోకేష్. మొత్తానికి ఇంత పెద్ద భారీ కాస్ట్ ఉన్నా కూడా సంవత్సరాలు తరబడి తీయకుండా ఈ సినిమాను కూడా త్వరగానే పూర్తి చేశాడు. ఇక ఏ స్థాయి సక్సెస్ రజనీకి అందిస్తాడు ఆగస్టు 14న ఒక క్లారిటీ వస్తుంది.
Also Read: Mythri Movie Makers : మైత్రీ పదేళ్ల ప్రయాణం… వాళ్ల హిట్స్ అండ్ ప్లాప్స్ ఇవే