Harihara Veeramallu : టాలీవుడ్ స్టార్ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే ఈ నెలలో థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఒక్కో అప్డేట్ ను వదులుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ అంచనాలను రీచ్ అయ్యేలా కనిపిస్తుంది.. సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వివాదాలు పెరుగుతున్నాయి.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. వివరాల్లోకి వెళితే..
వివాదంలో ” హరిహర వీరమల్లు”..
ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. విడుదల అవుతుందని ఫిక్స్ అయ్యేలోపు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణ పోరాట యోధుడు, పాలమూరు కేంద్రంగా పనిచేసిన పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా సాయన్న చరిత్రను వక్రీకరించి, సినిమాకు అనుగుణంగా కల్పిత కథను జోడించారని ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది..
పండుగ సాయన్న ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర సమర యోధుడు పండుగ సాయన్న మహబూబ్ నగర్ లో జన్మించారు. 19వ శతాబ్దంలో దొరలు, దేశ్‌ముఖ్‌ల సంపదను కొల్లగొట్టి, పేదలకు పంచిన ధీరుడిగా చరిత్రలో నిలిచారు. తెలంగాణ రాబిన్ హుడ్గా పేరొందిన సాయన్న అణగారిన వర్గాలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన జీవితం సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లెక్కించబడి ఉంటుంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగానే ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే చాలాసార్లు ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది మరి ఇప్పుడు ఈ వివాదా నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి…
Also Read: సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వకండి..
మళ్లీ వాయిదా పడుతుందా..?
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి మరియు ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో, దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ మూవీ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 17వ శతాబ్దం ముస్లిం పాలన సమయంలో పవన్ కళ్యాణ్ ఓ వీరుడిగా, ప్రజా పరిరక్షణ కోసం పోరాడే పాత్రలో కనిపించనున్నారు..