The RajaSaab : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో రాజా సాబ్ ఒకటి.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి వాయిదాల గండం పట్టుకుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. మార్చి లో థియేటర్లలోకి రావాల్సింది. కానీ అడ్డంకుల కారణంగా వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ లో థియేటర్లలోకి రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అప్పటికి కూడా మూవీ రాకపోవచ్చు అని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి భారీగానే బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతనో ఒకసారి చూసేద్దాం..
‘ రాజా సాబ్ ‘ టార్గెట్ పెద్దదే..
ప్రభాస్ సినిమాలకు టార్గెట్ ఎక్కువే.. పాన్ ఇండియా చిత్రాలు కావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడుపోతున్నాయి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి మూవీ బిజినెస్ భారీగానే జరిగింది. ఇప్పుడు విడుదల కాబోతున్న రాజా సాబ్ మూవీకి కూడా అంతకు మించి జరిగినట్లు తెలుస్తుంది. అయితే రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాజాసాబ్ భారీ రిటర్న్స్ రాబట్టనున్నాడు. అందిన సమాచారం మేరకు రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 200 నుంచి రూ. 250 కోట్లు జరగనుందని టాక్. మరి ఇంతకు మించి ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు..
‘రాజా సాబ్ ‘ మళ్లీ వాయిదా..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతిలో ఎప్పుడు అర డజను సినిమాలు ఉంటాయి. కానీ ఏడాదికి ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను పలకరిస్తాడు. అలాగే ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి, ప్రభాస్ కాంబోలో రాబోతున్న రాజా సాబ్ మూవీ కోసం ఆయన అభిమానులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ చెబుతున్నారే తప్ప కరెక్ట్ డేట్ కి వస్తున్నారంటూ కన్ఫామ్ గా చెప్పలేకపోతున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read : ఒకప్పుడు వాచ్ మెన్.. ఇప్పుడు స్టార్.. కోట్ల సంపాదన.. ఎవరంటే..?
అయితే, ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయట.. అందుకే డిసెంబర్ కూడా రాకపోవచ్చునని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 2026 సంక్రాంతి బరిలో ‘ది రాజా సాబ్’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. మరి నిజంగానే ఈ సినిమా రిలీజ్‌ను మరోసారి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు..