Coolie: చాలామంది దర్శకులకి సెన్సార్ బోర్డుతో ఇప్పుడు ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కువ మంది దర్శకులు సెన్సార్ తో ఉన్న ప్రాబ్లం గురించి బయట మాట్లాడరు. ఎందుకంటే ఆ దర్శకుడు తీసే తదుపరి సినిమా ఇబ్బందికి గురి అవుతుందేమో అని. కానీ సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెబుతూనే ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమా టైంలో చాలా వివాదాలు నెలకొన్నాయి.
అయితే చాలా సినిమాలకు A సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి. రీసెంట్ గా కూలీ సినిమా చూసిన తర్వాత చాలామందికి వచ్చిన డౌట్ ఇది. రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో మించిన యాక్షన్ సీన్స్ చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ ఆ సినిమాలకి ఎప్పుడూ A సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే కూలీకి A సర్టిఫికెట్ ఇవ్వడం వెనక కారణం ఒక ప్రముఖ జర్నలిస్ట్ తమిళ్ మీడియాలో రివిల్ చేశాడు.
కూలీ సినిమాకి ‘A’ సర్టిఫికెట్
వాస్తవానికి కూలి సినిమాకి U/A సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ సెన్సార్ బోర్డులో చాలా రూల్స్ మారిపోయాయి. రూల్స్ మారిపోయిన తరువాత విడుదలవుతున్న ఫస్ట్ సినిమా కూలీ. అందుకే ఆ రూల్స్ కి అనుగుణంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ వచ్చింది. దీనిని బట్టి చూస్తే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ముందు ముందు రాబోయే కొన్ని సినిమాలకు A సర్టిఫికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. సెన్సార్ బోర్డు గురించి పలు సందర్భాలలో చాలామంది మాట్లాడారు.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..
అర్జున్ రెడ్డి సినిమా ఈవెంట్ లో సందీప్ రెడ్డి మాట్లాడుతూ సెన్సార్ రూమ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా? వైవా రూమ్ లానే ఉంటుంది. ముందు ఒక లెక్చరర్ డిసైడ్ అవుతాడు. ఒక స్టూడెంట్ ని చూసి వీటిని సంవత్సరం లేపేద్దామని. అలానే సెన్సార్ వాళ్లు కూడా నా సినిమాని అలానే చేశారు. వీడు మాకు చెప్పకుండా టీజర్ వదిలిండు అంటూ మాట్లాడారు. టీవీకి ఎట్లా ఇచ్చినవ్ పర్మిషన్ అని అడిగారట. అప్పుడు సందీప్ నేనేమి ఎవనికి పర్మిషన్ ఇయ్యలేదు వాళ్ళే తీసేసుకున్నారు అని చెప్పాడు. గతంలో బిజినెస్ మెన్ సినిమా అప్పుడు కూడా ఈ సినిమాను మించి చాలా సినిమాల్లో బూతులు ఉన్నాయి. ఆ సినిమాలకి A సర్టిఫికెట్ ఇవ్వలేదు మరి దీనికి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు అంటూ మహేష్ బాబు అన్నారు.
Also Read: Vishwambara update : బాస్ బర్తడే కి టీజర్ ఫిక్స్, ఈసారైనా జాగ్రత్త పడ్డారా?