Coolie 3rd Single: అనిరుద్ రవి చందర్… పిట్ట కొంచెం కూత గానం అనే సామెతకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అనిరుద్. చూడ్డానికి బక్కగా కనిపించినా కూడా సంగీతం మాత్రం బలంగా కొడతాడు. ముఖ్యంగా రజినీకాంత్ సినిమా అంటే రెచ్చిపోతాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పెట్ట సినిమాతో మొదటిసారి రజనీకాంత్ సినిమాకు సంగీతం అందించాడు అనిరుద్. ఒక అభిమాని రజినీకాంత్ ని ఎలా చూపించాలో అలా కార్తీక్ సుబ్బరాజు చూపిస్తే, అభిమాన హీరోకి ఎటువంటి మ్యూజిక్ ఇవ్వాలో అని అనిరుద్ చూపించాడు.
అనిరుద్ చాలా మంది హీరోలకు మ్యూజిక్ అందిస్తాడు. కానీ రజినీకాంత్ సినిమాకి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఇస్తాడు. స్వతహాగా రజనీకాంత్ అభిమాని కావడంతో, తన ఇష్టం అంతటినీ కూడా పాటలో వినిపించేలా చేస్తాడు. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ హీరోగా చేసిన ప్రతి సినిమాకి మాస్ డ్యూటీ చేశాడు. ఒక ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలి సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
కూలీ పవర్ హౌస్ సాంగ్ అవుట్
కూలీ సినిమాలో ది పవర్ హౌస్ అనే పాట ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైనప్పుడు కూడా ఈ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వినిపించింది. అయితే ఈ ఫుల్ సాంగ్ ఇప్పుడు విడుదలైంది. హైదరాబాదులో ఈ సాంగ్ ఈవెంట్ ను ప్రత్యేకంగా జరిపారు. అనిరుద్ ఈ సాంగ్ కి పర్ఫార్మ్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ పాట అఫీషియల్ గా విడుదల అయిపోయింది. ఎప్పటిలాగానే రజినీకాంత్ కు అనిరుద్ ఏ లెవెల్ హిట్ సాంగ్ ఇస్తాడు అదే రేంజ్ లో ఇచ్చాడు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించాడు. అరివు & అనిరుద్ కలిసి ఈ పాటను ఆలపించారు. రజనీకాంత్ ఎలివేషన్ కు ఈ వాయిస్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. రజనీకాంత్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ ఎలివేషన్ సాంగ్ పడింది అని చెప్పాలి.
భారీ అంచనాలు
కూలీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. లియో సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
Also Read: Pawan Kalyan: నేను పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకున్నా.. యాక్టర్ వెంకట్