OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక మహిళ తన కుటుంబం కోసం ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. తన అద్దె ఇంటిని కొనడానికి ఈ ప్రయాణం మొదలుపెడుతుంది. అయితే క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఒక తెలుగు సినిమా స్టోరీలా అనిపించినా, చివరివరకు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘నైట్ ఆల్వేస్ కమ్స్’ (Night Always Comes) విల్లీ వ్లాటిన్ 2021లో రచించిన ఒక నవల ఆధారంగా రూపొందిన ఒక అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. బెంజమిన్ కారన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో వనెస్సా కిర్బీ, జెన్నిఫర్ జాసన్ లీ, జాక్ గాట్సాగెన్, స్టీఫెన్ జేమ్స్, జూలియా ఫాక్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. 108 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2025 ఆగస్టు 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, IMDbలో 6.4/10 రేటింగ్ ను పొందింది.
కథలోకి వెళ్తే
లైనెట్ ఒక పోర్ట్‌ల్యాండ్‌లో తన తల్లి డోరీన్, మానసిక వైకల్యం ఉన్న తన అన్న కెన్నీతో ఒక పాత ఇంట్లో నివసిస్తుంటుంది. ఆమె బ్రెడ్ ఫ్యాక్టరీలో, బార్‌లో వేశ్యగా పని చేస్తూ కూడా ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తుంటుంది. వీళ్ళు అద్దెకు నివసిస్తున్న ఇంటిని కొనుగోలు చేయడానికి 25,000ల డాలర్లు డౌన్ పేమెంట్ అవసరమవుతాయి. అయితే డోరీన్ ఆ డబ్బును కొత్త కారు కొనడానికి వినియోగిస్తుంది. ఈ కుటుంబాన్ని ఆదాయం లేని స్థితికి తీసుకెళ్తుంది. ఇంటి యజమాని డేవిడ్, లైనెట్‌కు ఒక రోజు గడువు ఇస్తాడు. లేకపోతే ఇల్లు వేరొకరికి అమ్ముతానని చెప్తాడు. లైనెట్ ఇప్పుడు తన గతంలోని అండర్‌వరల్డ్ కనెక్షన్‌లను ఉపయోగించి, ఒక రాత్రిలో $25,000 సమీకరించేందుకు ఒక ప్రమాదకర ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
Read Also : అమ్మాయిల్ని ఆ పని కోసమే పుట్టించే ఆణిముత్యం… లాభం లేదు ఒంటరిగా చూడాల్సిందే భయ్యా