OTT Movie : కొత్త ఇంట్లోకి మారిన ఒక సాధారణ యువతి, ఆన్‌లైన్‌లో సెకండ్‌హ్యాండ్ వాషింగ్ మెషిన్ కొంటుంది. కానీ అది ఏ మాత్రం పనిచేయదు. ఆమె స్కామర్‌ను బయటపెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ నిర్ణయం ఒక సైకోపాతిక్ సీరియల్ కిల్లర్ కి లక్ష్యంగా మారుతుంది. ఆమె జీవితం ఒక్కసారిగా భయంకరమైన పీడకలగా మారుతుంది. అపరిచిత ఫోన్ కాల్స్, ఆర్డర్ చేయని ఫుడ్ డెలివరీలు, రాత్రి వేళల్లో ఆమె ఇంటి వద్ద కనిపించే పోకిరీలతో ఆమె విసిగిపోతుంది. ఇంతకీ ఆమె ఆ స్కామ్ ను బయటపెడుతుందా ? సైకో కిల్లర్ ఆమెకు టార్గెట్ ఎలా అవుతాడు ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఆన్‌లైన్ సెకండ్‌హ్యాండ్ ట్రేడింగ్‌లోని మోసాల ఆధారంగా నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తి పొందింది. ఈ కథ జాంగ్ సూ-హ్యూన్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేసే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారిన తర్వాత, తన వాషింగ్ మెషిన్ పాడైపోతుంది. కొత్త మెషిన్ కొనడం ఖరీదైనదని భావించి, ఆమె తన స్నేహితురాలు ఓ డాల్-జా సలహాతో సెకండ్‌హ్యాండ్ యాప్ ద్వారా చౌకగా ఒక వాషింగ్ మెషిన్ కొంటుంది. కానీ ఆ మెషిన్ పని చేయకపోవడంతో, ఆమె స్కామ్‌కు గురైనట్లు గుర్తిస్తుంది.సూ-హ్యూన్, స్కామర్‌ను అలాగే వదిలేయాకుండా, అతని ఆన్‌లైన్ ఖాతాను గుర్తిస్తుంది. అతని పోస్ట్‌లపై “స్కామర్” అని కామెంట్స్ చేసి, పోలీసులకు రిపోర్ట్ చేస్తుంది. ఈ చర్య ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆమెకు అజ్ఞాత ఫోన్ కాల్స్, ఆర్డర్ చేయని ఫుడ్ డెలివరీలు, రాత్రి వేళల్లో ఆమె ఇంటి వద్ద కనిపించే అపరిచిత వ్యక్తులతో వాతావరణం భయంకరంగా మారుతుంది.
స్కామర్ కేవలం ఒక మోసగాడు మాత్రమే కాదు, ఒక సైకోపాతిక్ సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆమెను టార్గెట్‌గా చేసుకుంటాడు.సైబర్ క్రైమ్ యూనిట్‌లోని డిటెక్టివ్ జూ చుల్-హో, మొదట సూ-హ్యూన్ కేసును తేలిగ్గా తీసుకుంటాడు. ఎందుకంటే అతను రోజూ వందలాది ఆన్‌లైన్ క్రైమ్ కేసులను డీల్ చేస్తాడు. కానీ ఆ తరువాత ఈ కేసు తీవ్రతను గుర్తిస్తాడు. డిటెక్టివ్ అతని జూనియర్ నా సీంగ్-హ్యూన్ తో కలిసి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తారు. సూ-హ్యూన్, కేవలం బాధితురాలిగా ఉండకుండా, క్రిమినల్‌ను పట్టుకోవడానికి స్వయంగా చర్యలు తీసుకుంటుంది. కానీ ఆమె నిర్ణయాలు ఆమెను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. ఈ సినిమా ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో, చివరి క్షణం వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చివరికి ఆ సైకోని సూ-హ్యూన్ పట్టుకుంటుందా ? డిటెక్టివ్ ఈ కేసును సాల్వ్ చేస్తాడా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఓటిటిలో టాప్ లేపుతున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే… ఇంకా చూడలేదా?
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘టార్గెట్’ (Target). 2023 లో వచ్చిన ఈ సినిమాకు పార్క్ హీ-గాన్ దర్శకత్వం వహించారు. ఇందులో షిన్ హై-సన్ (జాంగ్ సూ-హ్యూన్), కిమ్ సంగ్-క్యూన్ (డిటెక్టివ్ జూ), కాంగ్ తై-ఓ (డిటెక్టివ్ నా), లీ జూ-యంగ్ (ఓ డాల్-జా) వంటి నటులు నటించారు. 1 గంట 41 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.