OTT Movie : కోల్‌కతా సిటీ గందరగోళ నేపథ్యంలో, ఒక రియలిస్టిక్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమా ఐదుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది. ఇందులో వీళ్లంతా వ్యక్తిగత, వృత్తిపరమైన సంక్షోభాలను ఎదుర్కుంటూ, కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ సరికొత్త స్టోరీ మిమ్మల్ని చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
కోల్‌కతా నగరంలో ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది. ఇరా, సుజీ, మేహర్, రూప, మిస్ సేన్ అనే మహిళల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఇరా ఒక ఫోటోజర్నలిస్ట్ “న్యూ-ఏజ్ కోల్‌కతా మహిళలు” అనే స్టోరీపై పనిచచేస్తూ, ఆ రోజు సాయంత్రం 9 గంటలకు తన లివ్-ఇన్ పార్టనర్ ఆర్చీతో నిశ్చితార్థ పార్టీకి హాజరు కావాలనే ఒత్తిడిలో ఉంటుంది. ఆమె మొదటి ప్రొఫైల్‌గా ఒక ప్రముఖ యాడ్ ఏజెన్సీ అధినేతను ఎంచుకుంటుంది. కానీ ఆమె కెరీర్ కష్టాలు, వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటుంది. సుజీ ఒక సింగిల్ మదర్, ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. తన డ్రగ్-అడిక్ట్ భర్త కారణంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ, తన కొడుకు చదువు కోసం డబ్బు సమకూర్చడానికి పోరాడుతుంది.
మేహర్ ఒక స్ట్రగ్లింగ్ నటి. కాస్టింగ్ కౌచ్ సమస్యలతో పోరాడుతూ, తన సోదరుడు, తల్లి కోసం డబ్బు సంపాదించాలని కష్టపడుతుంది. రూప ఒక గృహిణి, తన భర్త, అత్తమామల నుండి శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆమెకు టెర్మినల్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మహిళల జీవితాలు ఒక దుర్ఘటన ద్వారా ఒకదానితో ఒకటి ముడిపడతాయి. వీళ్ళ నిర్ణయాలు ఒకరిపై ఒకరు ప్రభావం చూపుతాయి. ఇక కథ ముందుకు సాగుతున్నప్పుడు, ఇరా తన కెరీర్, నిశ్చితార్థం మధ్య డైలమాలో ఉంటుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆర్చీ ఆమెకు స్వేచ్ఛ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారి సంబంధం ఒత్తిడిలో ఉంటుంది.
Read Also : ఐదుగురు మనుషులతో 30 రోజులు అదే పని… బ్లడీ డెత్ గేమ్… థ్రిల్లింగ్ మలుపులు, ఊహించని సర్ప్రైజులు
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘క్రిస్‌క్రాస్’ (Criss cross) బిర్సా దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం. ఇది స్మరంజిత్ చక్రబర్తి రాసిన నవల ఆధారంగా రూపొందింది. శ్రీ వెంకటేశ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోనీ నిర్మించిన ఈ చిత్రంలో నుస్రత్ జహాన్, మిమీ చక్రబొర్తి, జయ అహ్సాన్, సోహినీ సర్కార్, ప్రియాంక సర్కార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జియో హాట్‌స్టార్, హోయ్‌చోయ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. IMDbలో ఈసినిమాకి 5.6/10 రేటింగ్ ఉంది.