Dil Raju:ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ గా పని చేస్తుందో అందరికీ తెల్సిందే. ముక్యంగా సెలబ్రిటీలను పైకి లేపాలన్నా అదే.. కిందకు దించాలన్నా సోషల్ మీడియానే.అందుకే ఈమధ్య సెలబ్రిటీలు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. మైక్ దొరికింది కదా అని, ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. సోషల్ మీడియాలో నిర్మొహమాటంగా ఏకీపారేస్తున్నారు. అక్కడ ఉంది స్టార్ నా .. ? నిర్మాతనా.. ? హీరోయినా ? అనేది ఎవరు చూడడం లేదు. అందులోనూ తమ అభిమాన హీరోను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకొనేదే లేదు. ఇక తాజాగా మెగా ఫ్యాన్స్ కూడా అదే చేశారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి ఇవ్వక ఇవ్వక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పై, గేమ్ ఛేంజర్ సినిమాపై లేనిపోనీ ఆరోపణలు చేశాడు. గేమ్ ఛేంజర్ సినిమా వలన తాము ఎంతో నష్టపోయామని, రామ్ చరణ్ కానీ, శంకర్ కానీ ఒక్క కాల చేయలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, మెగా ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం ఇట్టే జరిగిపోయాయి. దీంతో వెంటనే స్పందించిన దిల్ రాజు.. డ్యామేజ్ కంట్రోల్ బాధ్యతలను భుజానా వేసుకున్నాడు. ఆరు నెలల క్రితం సినిమా గురించి ఇప్పుడెందుకు ఇంత నెగిటివిటీ వదిలేయండి అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత శిరీష్ తో క్షమాపణలు ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. అది కూడా చాలనట్లు తాజాగా తమ్ముడి చేత వీడియో కూడా చేయించి అందులో వివరణ కూడా ఇప్పించాడు.
ఆ వీడియోలో శిరీష్ ” నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి నిజంగానే క్షమాపణలు చెబుతున్నాను. చరణ్ గారికి కూడా క్షమాపణలు చెబుతున్నాను. చరణ్ గారితో నాకు ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌ను పాడుచేసుకోదల్చుకోలేదు” అంటూ కొంచెం బాధతోనే సారీ చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకో అనుమానం బయటపడింది. అదేంటంటే.. ఇంత హడావిడిగా ఈ వివాదాన్ని ముగించేయాల్సిన అవసరం ఏంటి.. ? సాధారణంగా దిల్ రాజు ఏ వివాదాన్ని అయినా ముగించాల్సివస్తే.. నెమ్మదిగా ప్రెస్ మీట్ పెట్టి.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పుడు దానికో ముగింపు ఇస్తాడు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. హడావిడిగా శిరీష్ చేత క్షమాపణలు చెప్పించాడు. దానికి కారణం తమ్ముడు. అదేనండీ తమ్ముడు సినిమా.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4 న రిలీజ్ కానుంది. అంటే మరో రెండు రోజుల్లో తమ్ముడు రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎక్కడ ఈ వివాదం అడ్డుగా నిలుస్తుందేమో అన్న భయం దిల్ రాజును వెంటాడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా దిల్ రాజు ఈ వివాదాన్ని ముగించేశాడు. వివాదాల వలన కొన్ని సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను ఎదుర్కున్నాయో కళ్ళారా చూసిన దిల్ రాజు.. తన సినిమాకు అలాంటి గతి పట్టకూడదని తెలివిగా చేసిన ప్లాన్ ఇది అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా దిల్ రాజు ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి మెగా ఫ్యామాస్టర్న్స్ చల్లబడ్డారని టాక్. మరి ఈ వివాదం ఎఫెక్ట్ తమ్ముడు మీద పడుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.