E-Paper
Advertisement

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Kavya – Anirudh: సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన సినిమా పాటలతో యువతను ఉర్రూతలూగించే యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh) , సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో నవంబర్ 11న అనగా నేడు ఒక్కటి కాబోతున్నారు. అయితే ఈ వివాహానికి గ్రీస్ దేశం వేదిక అయింది. ఈ నేపథ్యంలోనే ఈ పెళ్లి వేడుక ప్రత్యేకతలతో పాటు ఈ జంట గ్రీస్ దేశాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అనే విషయంపై కూడా చాలామంది నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయాలు ఇప్పుడు చూద్దాం.

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి..

నవంబర్ 11న గ్రీస్ లోని అత్యంత అందమైన శాంటోరిని సమీపంలో అత్యంత వైభవంగా ఈ వివాహం జరుగుతోంది. నవంబర్ 10, 11వ తేదీలలో రెండు రోజులపాటు జరుగుతున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల అరుదైన కలయికగా ఈ వేడుక నిలవబోతోంది. ఈ అల్ట్రా లగ్జరీ వివాహానికి హాజరైన అత్యంత ముఖ్యమైన అతిథుల కోసం మారన్ కుటుంబం ప్రత్యేకంగా నాలుగు ప్రైవేటు జెట్ విమానాలను కూడా ఏర్పాటు చేసింది. అతిధుల ప్రయాణ వసతి, స్థానిక రవాణా బాధ్యతలన్నింటికీ కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవడం గమనార్హం.

సూపర్ స్టార్ రజినీకాంత్ కు స్వయానా మేనల్లుడు..

Advertisement

ఇకపోతే అనిరుధ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)కు స్వయానా మేనల్లుడు కావడంతో ఆయన తన కుటుంబంతో కలిసి ఈ పెళ్లికి హాజరయ్యారు. అలాగే డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయినిది స్టాలిన్ కూడా ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ పెళ్లికి సంబంధించిన డిజైనర్ వెడ్డింగ్ కార్డ్ బాక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐవరీ అలాగే పౌడర్ బ్లూ రంగుల కలయికతో క్లాసిక్ గా దీనిని డిజైన్ చేయడం గమనార్హం.

గ్రీస్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

ఇకపోతే వీరి వివాహానికి గ్రీస్ దేశాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి అత్యంత ప్రసిద్ధ దేశాలలో ఒకటిగా గ్రీస్ నిలిచింది. అయితే ఈ దంపతులు కూడా గ్రీస్ దేశాన్ని ఎంచుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.. ఇక్కడ ఏడాదిలో సుమారు 300 రోజులు ఎండతో కూడిన ఆహ్లాదకరమైన మధ్యధరా వాతావరణం ఉంటుంది. రిసెప్షన్లకు ఎంతో అనుకూలమైన ప్రదేశం. సముద్రతీరాలు, చారిత్రక కట్టడాలు, తెల్లటి అందమైన భవనాలు వివాహ వేడుకలకు అద్భుతమైన బ్యాక్ డ్రాప్ ను అందిస్తాయి. ముఖ్యంగా తెల్లటి భవనాలు, నీలి సముద్రం , పురాతన కట్టడాల మధ్య తీసుకునే వివాహ ఫోటోలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ప్రత్యేకించి సాయంత్రం వేళ సూర్యాస్తమయం కాంతులు ఫోటోలకు మరింత అందాన్ని తెస్తాయని చెప్పవచ్చు.

ఆకట్టుకునే ఆతిథ్య సాంప్రదాయం..

Advertisement

ఇకపోతే గ్రీక్ సంస్కృతిలో అతిధులను దేవుడిగా భావించే ‘ఫిలోక్సేనియా’ అనే ఆతిథ్య సాంప్రదాయం కూడా ఉంది. ఇది అక్కడికి వచ్చే అతిధులకు మరువలేని అనుభూతిని అందిస్తుంది. ఇక ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ లకు గ్రీక్ వంటకాలు మరో ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. స్థానికంగా లభించే సముద్రపు ఆహారం, గ్రీక్ వంటకాలు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇదే సమయంలో ఊజో, మాస్టిహ వంటి సాంప్రదాయ పానీయాలు కూడా వివాహ విందులో ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ దంపతులు గ్రీస్ దేశాన్ని జీవితాంతం గుర్తుండిపోయే వివాహ వేడుకకు వేదికగా మార్చుకున్నారు.

Related News

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?

Tollywood Updates : స్టార్ హీరోల సినిమాలు.. షూటింగ్ అప్డేట్స్..

దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

ప్రియా భవాని శంకర్ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!

పెళ్లిచూపులు సినిమా కోసం అన్ని కష్టాలు పడ్డా.. తరుణ్ భాస్కర్!

నా సినిమాలన్నీ అంతే.. రిలీజ్ డేట్స్‌పై వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×