Tollywood Updates : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. దసరా దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడంతో పాటుగా భారీ వసూళ్లను అందుకున్నాయి. రీసెంట్ గా దీపావళి కానుకగా రిలీజ్ అయిన రామాయణ సినిమా రోజురోజుకీ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. భారీ బడ్జెట్ తో పాటుగా భారీ విజువల్ వండర్ గా వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఇకమీదట క్రిస్మస్ సినిమాలతో పాటుగా వచ్చే ఏడాది జనవరి సినిమాలకు కూడా ఇప్పటినుంచి డిమాండ్ పెరుగుతుంది. మరి ఈ సినిమాల షూటింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్ లోనూ, అలాగే సోషల్ మీడియాలను తెగ వెతికేస్తూ ఉంటారు. మరి ఇక ఆలస్యం ఎందుకు ప్రస్తుతం షూటింగ్లో ఉన్న స్టార్ హీరోల సినిమాల షూటింగ్ అప్డేట్స్ గురించి ఒకసారి చూసేద్దాం..
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాకా’.. డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరికెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఏ సినిమాపై కూడా అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.. వచ్చేయడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ఫౌజీ.. రీసెంట్ గా ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. 2027 మార్చి 19 ఈ సినిమాను థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం కింగ్ 100.. భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మాదాపూర్ లో జరుగుతుంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం తులాభారం.. రీసెంట్ గా ఆయన నటించిన ఇరుముడి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్ మెంట్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లింగంపల్లి సమీపంలోని బీరంగూడ కొడకంచి ఆలయంలో జరుగుతోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇకపోతే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన డ్రాగన్ చిత్రం హైదరాబాద్ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వారణాసి చిత్రం కూడా హైదరాబాదులోనే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ని హైదరాబాద్ శంషాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అటు శర్వానంద్ నటిస్తున్న జార్జ్ క్రిష్ మూవీ కూడా హైదరాబాదులోనే షూటింగ్ జరుగుతుంది. మొత్తానికి ఈ సినిమాలన్నీ త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టే పనిలో బిజీగా ఉన్నాయి మరి ఈ చిత్రాలలో ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి..
Also Read :దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?