Dishapatani : సినిమా హీరోయిన్లు సినిమాలతో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగానే ఉంటారు. తమ సినిమాల గురించి ప్రమోట్ చేసుకోవడంతో పాటుగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈమధ్య సామాన్యుల కంటే సెలబ్రిటీ లో ఎక్కువగా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు అని ఒక వార్త వినిపిస్తుంది.. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన నటీనటులు సినిమాలలో అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్న నటీనటుల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ కూడా చేరింది. ఆమె మరెవరో కాదు దిశా పటాని. ఈమె నెలకు సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి ఆమె ఎన్ని లక్షల సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి యూత్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు యువతను తన నటనతో మెప్పించింది. అయితే ఈమె ఎక్కువగా హాట్ లుక్ లో ఉన్న పాత్రలో నటిస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక సినిమాలతో పాటుగా అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతిపోగొట్టేస్తుంది. గత కొద్దిరోజులుగా ఈమె సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే చర్చనీ అంశంగా మారింది మరి నిజంగానే దిశా పటాన్ని నెలకు 20 లక్షల వరకు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి నిజంగానే అంత సంపాదిస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే దిశా పటాన్ని క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..
బాలీవుడ్ బ్యూటీ దిశ పటానికి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన కల్కి మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలతో పాటుగా తమిళ హీరో సూర్య నటించిన కంగువ సినిమాలో కూడా నటించింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఈమె వైట్ శారీలో ఉన్న పిక్స్ ని షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.