Priya Bhavani Shankar:2026వ సంవత్సరం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సెలబ్రెటీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)- రష్మిక మందన్న(Rashmika mandanna)8 ఏళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ.. పెళ్లి చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఆ తర్వాత అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయానికా రెడ్డితో ఏడడుగులు వేయగా.. ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కూడా తన గర్ల్ ఫ్రెండును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరొకవైపు సాయిధరమ్ తేజ్, తేజ సజ్జ ఇద్దరు కూడా డిసెంబర్లో వివాహం చేసుకోబోతున్నారు. అలాగే నేడు గ్రీస్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ సీఈవో కావ్య మారన్ తో ఏడడుగులు వేయబోతున్నారు.
ఇప్పుడు మరో బ్యూటీ కూడా పెళ్లికి సిద్ధమయ్యింది. ఇటీవలే ఇరుముడి సినిమాతో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) ఈ లిస్టులోకి చేరిపోయింది. ముఖ్యంగా 18 ఏళ్ల వయసు నుంచే ప్రేమలో ఉన్న ఈమె, ఈ సుదీర్ఘకాల ప్రేమకు స్వస్తి పలుకుతూ పెళ్లి వరకు తీసుకెళ్లింది. దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 10వ తేదీన అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా తన ప్రియుడు రాజ్వేల్ రాజ్ తో నిశ్చితార్థం చేసుకుంది.. గతంలోనే తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. ఇద్దరు కలిసి ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశారు. నిత్యం వీరిద్దరూ కలిసి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోగా ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.
ప్రియా భవాని శంకర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో.. ప్రియా కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియా భవాని శంకర్ రాజ్ వేల్ రాజ్ ఇద్దరూ కాలేజీ రోజుల నుండి మంచి ప్రాణ స్నేహితులు. రాజ్ వేల్ రాజ్ విషయానికి వస్తే ఈయన ఫైనాన్స్ రంగానికి చెందిన వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రావెలింగ్, ఫిట్ నెస్ పై ఆసక్తి ఉన్న రాజ్ వేల్ జిమ్ వర్కౌట్స్ తో పాటు థాయిలాండ్ లో మాయ్ థాయ్ శిక్షణ కూడా పొందారు.
also read:హైంధవ డైరెక్టర్ పై జేడీ ఫైర్.. ఛాన్స్ ఇచ్చినోడికే దెబ్బలా?
తెలుగు, తమిళ్ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. ఇటీవల రవితేజ హీరోగా శివా నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి చిత్రంలో కావేరీ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మరగదా నాణెం 2, డెమోంటే కాలనీ 3, కమల్ హాసన్ ఇండియన్ 3 వంటి క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరియర్ పరంగా బిజీగా ఉన్నా.. తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈమె సిద్ధమవడంతో ఇటు రెండు ఇండస్ట్రీలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.